Site icon NTV Telugu

Female Teacher: 16 ఏళ్ల బాలుడితో మహిళా టీచర్ ఎఫైర్.. దీనికి తండ్రి అనుమతి..

Usa

Usa

Female Teacher: అమెరికాలో ఇటీవల కాలంలో మహిళా టీచర్లు వారి విద్యార్థులతో అక్రమ సంబంధాలు పెట్టుకోవడం వంటి ఘటనలు చాలా వెలుగులోకి వస్తున్నాయి. చదువు చెప్పాల్సిన టీచర్లు, మైనర్ విద్యార్థులతో సెక్స్ సంబంధాలు పెట్టుకుంటున్నారు. తాజాగా మరోసారి ఇలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది. 16 ఏళ్ల విద్యార్థితో మహిళా టీచర్ ‌‌శృంగారం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. తోటి విద్యార్థి వీరి సంబంధాన్ని బయటపెట్టాడు.

ఈ కేసులో మహిళా టీచర్‌తో పాటు తన కొడుకు లైంగిక సంబంధానికి మద్దతు ఇచ్చినందుకు విద్యార్థి తండ్రిపై కూడా పోలీసులు అభియోగాలు మోపారు. నిందితురాలిని 26 ఏళ్ల హేలి నిచెల్ క్లిఫర్టన్ కర్మాన్‌గా గుర్తించారు. అమెరికాలోని మిస్సౌరీ రాష్ట్రంలోని లాకీ హైస్కూల్‌లో పనిచేసే హేలీ గత వారం టెక్సాస్ లోని గార్డెన్ రిడ్జ్ లోని ఇంటికి పారిపోతుండగా అరెస్ట్ చేశారు.

Read Also: Red Ant Chutney: “ఎర్ర చీమల” పచ్చడికి భౌగోళిక గుర్తింపు(GI).. ఈ వంటకం ప్రయోజనాలు, విశేషాలు..

తోటి విద్యార్థి హేలీ, 16 ఏళ్ల విద్యార్థి మధ్య సంబంధంపై స్కూల్ రిసోర్స్ ఆఫీసర్‌కి తెలియజేయగా.. అతను పోలీసులకు ఫిర్యాదు చేశాడు. టీచర్ హేలీతో, తన క్లాస్‌మేట్ సెక్స్ చేశాడని సాక్షి పోలీసులకు తెలిపాడు. సహ విద్యార్థి వీపు భాగంలో ఉన్న గాయాలను పోలీసులు గుర్తించారు. హేలీ, విద్యార్థి వెనకభాగంలో గోర్లతో రక్కినట్లు పోలీసులు గుర్తించారు. విద్యార్థితో సంబంధం పెట్టుకున్న హేలీ ఇటీవల తన భర్తతో విడాకులు తీసుకున్నట్లుగా తెలుస్తోంది. వీరిద్దరి మధ్య సంబంధం కారణంగానే హేలీ అతనికి అసైన్‌మెంట్లలో 100 శాతం మార్కులు ఇచ్చేదని సాక్షిగా ఉన్న సహవిద్యార్థి ఆరోపించారు. అయితే, ఈ ఆరోపణల్ని హేలీ ఖండించింది. వీరిద్దరి మొబైల్స్ పరిశీలించగా.. ఇద్దరి మధ్య సంబంధం బయటపడింది. పారిపోతున్న క్రమంలో హేలీని అరెస్ట్ చేశారు.

Exit mobile version