Site icon NTV Telugu

Crime News: సూట్‌కేసులో 9 ఏళ్ల బాలిక.. అత్యాచారం చేసి, హత్య..

Rangareddy Crime

Rangareddy Crime

Crime News: ఢిల్లీలో దారుణం జరిగింది. 09 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి, రక్తస్త్రావం అవతున్న స్థితిలో ఆమెను సూట్‌కేస్‌లో కుక్కి చంపినట్లు ఆదివారం పోలీస్ అధికారులు తెలిపారు. బాలిక కనిపించకుండా పోయిన తర్వాత, కుటుంబ సభ్యులు ఆమె కోసం గాలింపు ప్రారంభించారు. కొన్ని గంటల తర్వాత, శనివారం సాయంత్రం నెహ్రూ విహార్‌లోని ఫ్లాట్‌లోని రెండో అంతస్తులో సూట్‌కేస్ కనిపించింది. ఇందులో బాలిక అపస్మారస్థితిలో కనిపించింది.

Read Also: Ameerkhan : మణిరత్నంతో మూవీ చేస్తా..

డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (నార్త్ ఈస్ట్), ఆశిష్ మిశ్రా మాట్లాడుతూ.. నిన్న రాత్రి 8.40 గంటల ప్రాంతంలో, తొమ్మిదేళ్ల మైనర్ బాలిక గాయపడిన స్థితిలో కనిపించినట్లు పిసిఆర్ కాల్ వచ్చిందని తెలిపారు. బాలికను ఆమె తండ్రి ఆస్పత్రికి తీసుకెళ్లినట్లు దయాల్‌పూర్ పోలీసులు తెలిపారు. అయితే, బాలిక చికిత్స తీసుకుంటున్న సమయంలోనే ఆమె మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. బాలికపై లైంగిక వేధింపుల సంకేతాలు ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు.

దయాల్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో హత్య కేసుతో పాటు, తీవ్రమైన లైంగిక వేధింపులకు సంబంధించిన పోక్సో చట్టంలోని సెక్షన్ 6 కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. క్రైమ్, ఫోరెన్సిక్ బృందాలు సంఘటనా స్థలాన్ని పరిశీలించి ఆధారాలు సేకరించే పనిలో ఉన్నాయి. నిందితుడి కోసం పోలీసులు సీసీటీవీ ఫుటేజ్‌ని స్కాన్ చేస్తున్నారు. కాలనీలో ఉంటున్న ఒక వ్యక్తి బాలికను తన ఫ్లాట్‌కి తీసుకెళ్లినట్లు ఆమె తండ్రి చెప్పారు. బాలిక కుటుంబీలకు ఫ్లాట్‌కి చేరుకోగా, తాళం వేసి ఉంది. తాళాలు పగలగొట్టి చూడగా దస్తులు లేకుండా బాలిక సూట్‌కేస్‌లో అపస్మారక స్థితిలో కనిపించిందని పోలీసులు తెలిపారు.

Exit mobile version