Site icon NTV Telugu

Kolkata: కోల్‌కతాలో మరో ఘోరం.. అమ్మమ్మ పక్కన నిద్రిస్తున్న చిన్నారిపై అకృత్యం

Wb

Wb

Kolkata: పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలోని కోల్‌కతాలో మరో దారుణం జరిగింది. రాత్రి అమ్మమ్మ పక్కన నిద్రిస్తున్న నాలుగేళ్ల బాలిక చోరీకి గురైంది. అనంతరం ఆ చిన్నారి లైంగిక వేధింపులను ఎదుర్కొందని పోలీసులు చెప్పారు. స్థానిక బంజారా కమ్యూనిటీకి చెందిన ఒక మహిళ తన మనుమరాలితో పాటు తారకేశ్వర్‌లోని రైల్వే షెడ్‌లో నిద్రిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది అని హుగ్లీ రూరల్‌ పోలీసు అధికారి ఒకరు చెప్పారు.

Read Also: IPL 2026-CSK: ఐపీఎల్ 2026 వేలంకు ముందే సంచ‌ల‌నం.. సీఎస్‌కేలోకి సంజు, జడేజా ఔట్!

అయితే, చిన్నారిపై దాడికి పాల్పడిన వ్యక్తి మంచంపై నుంచి బాలికను ఎత్తుకుపోయాడని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపించారు. మర్నాటి మధ్యాహ్నం ఆ చిన్నారి తారకేశ్వర్ రైల్వే హై డ్రెయిన్ సమీపంలో తీవ్ర గాయాలతో, రక్తపు మడుగులో పడి ఉంది. పాప నా పక్కన నిద్రపోతుండగా.. తెల్లవారుజామున పాపను ఎవరో లాక్కుపోయారని చెప్పింది. తమ ఇళ్లను కూల్చివేయడంతో వీధుల్లో నివసించాల్సిన పరిస్థితి వచ్చింది, తాము ఎక్కడికి వెళ్లాలని బాధితురాలు కన్నీళ్లు పెట్టుకుంది. కాగా ఈ కేసులో పోలీసులు ఆ బాలిక తాత రాజు దాస్ ను అరెస్టు చేశారు.

Read Also: CM Revanth Reddy: 60 వేల పైచిలుకు ఉద్యోగాలు.. 20 వేల నియామక నోటిఫికేషన్లు ఇచ్చాం..

ఇక, ప్రస్తుతం బాధిత చిన్నారి పరిస్థితి విషమంగా ఉండటంతో.. తారకేశ్వర్ గ్రామీణ ఆసుపత్రిలో చికిత్స అందజేస్తున్నారు. కాగా, పాక్పో చట్టం కింద ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ విషయం గురించి తెలియగానే బీజేపీ.. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సర్కార్ పై విమర్శలు చేసింది. తారకేశ్వర్‌లో నాలుగేళ్ల బాలికపై రేప్ జరిగితే.. బాధిత కుటుంబం పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసిన కేసు నమోదు చేయకుండా.. ఆ నేరాన్ని కప్పిపుచ్చే ప్రయత్నంలో బిజీగా ఉన్నారని ఆరోపించింది. ఇది మమతా బెనర్జీ స్వేచ్ఛాయుత పాలనను గుర్తు.. ఒక చిన్నారి జీవితం నాశనం అయిందని బెంగాల్ ప్రతిపక్ష నేత సువేందు అధికారి ట్విట్టర్ లో పోస్ట్ పెట్టారు.

Exit mobile version