Kolkata: కోల్‌కతాలో మరో ఘోరం.. అమ్మమ్మ పక్కన నిద్రిస్తున్న చిన్నారిపై అకృత్యం
- పశ్చిమ బెంగాల్‌లో మరో దారుణం..
- రాత్రి అమ్మమ్మ పక్కన నిద్రిస్తున్న నాలుగేళ్ల బాలిక అపహరణ..
- నిద్రిస్తుండగా చిన్నారిని తీసుకెళ్లి అత్యాచారం చేసిన దుండగులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kolkata: పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని కోల్‌కతాలో మరో దారుణం జరిగింది. రాత్రి అమ్మమ్మ పక్కన నిద్రిస్తున్న నాలుగేళ్ల బాలిక చోరీకి గురైంది. అనంతరం ఆ చిన్నారి లైంగిక వేధింపులను ఎదుర్కొందని పోలీసులు చెప్పారు. స్థానిక బంజారా కమ్యూనిటీకి చెందిన ఒక మహిళ తన మనుమరాలితో పాటు తారకేశ్వర్‌లోని రైల్వే షెడ్‌లో నిద్రిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది అని హుగ్లీ రూరల్ పోలీసు అధికారి ఒకరు చెప్పారు.
Read Also: IPL 2026-CSK: ఐపీఎల్ 2026 వేలంకు ముందే సంచలనం.. సీఎస్‌కేలోకి సంజు, జడేజా ఔట్!
Also Read
- AP Crime: ఏపీలో బంగ్లా విద్యార్థినిపై అత్యాచారయత్నం.. తప్పించుకునే క్రమంలో నిందితుడు మృతి
- TVK Leader Mu*rd*er: టీవీకే నేత దారుణ హత్య.. వెంటాడి కొడవళ్లతో దాడి.. సీసీటీవీలో షాకింగ్ దృశ్యాలు
- Delhi Building Collapse: సెకన్లలో కుప్పకూలిన ఐదు అంతస్తుల భవనం.. CCTVలో భయానక దృశ్యాలు, 6 మంది మృతి
- Miami Airport Plane Crash: మయామి విమానాశ్రయంలో ఘోర ప్రమాదం.. అమెజాన్ కార్గో బోయింగ్ 767 కూలి 5 మంది మృతి
అయితే, చిన్నారిపై దాడికి పాల్పడిన వ్యక్తి మంచంపై నుంచి బాలికను ఎత్తుకుపోయాడని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపించారు. మర్నాటి మధ్యాహ్నం ఆ చిన్నారి తారకేశ్వర్ రైల్వే హై డ్రెయిన్ సమీపంలో తీవ్ర గాయాలతో, రక్తపు మడుగులో పడి ఉంది. పాప నా పక్కన నిద్రపోతుండగా.. తెల్లవారుజామున పాపను ఎవరో లాక్కుపోయారని చెప్పింది. తమ ఇళ్లను కూల్చివేయడంతో వీధుల్లో నివసించాల్సిన పరిస్థితి వచ్చింది, తాము ఎక్కడికి వెళ్లాలని బాధితురాలు కన్నీళ్లు పెట్టుకుంది. కాగా ఈ కేసులో పోలీసులు ఆ బాలిక తాత రాజు దాస్ ను అరెస్టు చేశారు.
Read Also: CM Revanth Reddy: 60 వేల పైచిలుకు ఉద్యోగాలు.. 20 వేల నియామక నోటిఫికేషన్లు ఇచ్చాం..
ఇక, ప్రస్తుతం బాధిత చిన్నారి పరిస్థితి విషమంగా ఉండటంతో.. తారకేశ్వర్ గ్రామీణ ఆసుపత్రిలో చికిత్స అందజేస్తున్నారు. కాగా, పాక్పో చట్టం కింద ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ విషయం గురించి తెలియగానే బీజేపీ.. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సర్కార్ పై విమర్శలు చేసింది. తారకేశ్వర్‌లో నాలుగేళ్ల బాలికపై రేప్ జరిగితే.. బాధిత కుటుంబం పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసిన కేసు నమోదు చేయకుండా.. ఆ నేరాన్ని కప్పిపుచ్చే ప్రయత్నంలో బిజీగా ఉన్నారని ఆరోపించింది. ఇది మమతా బెనర్జీ స్వేచ్ఛాయుత పాలనను గుర్తు.. ఒక చిన్నారి జీవితం నాశనం అయిందని బెంగాల్ ప్రతిపక్ష నేత సువేందు అధికారి ట్విట్టర్ లో పోస్ట్ పెట్టారు.
తాజావార్తలు
-
Sajjala Ramakrishna Reddy: ‘డీఎస్సీలో అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి’..
-
National Film Awards: దశాబ్దాల సంప్రదాయానికి స్వస్తి.. జాతీయ చలనచిత్ర అవార్డుల వేదిక మార్పు!
-
Nitin Gadkari: అండర్‌వరల్డ్, రెడ్‌లైట్ ఏరియాల నుంచి ఎక్కువ ఓట్లు.. గడ్కరీ కీలక వ్యాఖ్యలు..
-
CM Chandrababu: స్వర్ణాంధ్ర విజన్ 2047పై సీఎం చంద్రబాబు క్లారిటీ.. ఎమ్మెల్యేలకు కీలక ఆదేశాలు..
-
Road Accident: యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. 12 మంది దుర్మరణం..
ట్రెండింగ్
-
93 గంటల ఆడియో ప్లేబ్యాక్, 120Hz డిస్‌ప్లే, 50MP కెమెరాతో iQOO Z11xa 5G లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
KKR Captain: టీమిండియా నుంచి తప్పించారు.. కట్ చేస్తే కప్ కొట్టాడు.. ఇప్పుడు కేకేఆర్కే బాస్..!
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
-
లగ్జరీ లుక్‌తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్‌లో అదిరిపోయే ఫీచర్లు.!
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్‌తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్‌తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!