Viral Video: పెళ్లి వేడుకల్లో అపశృతి.. డ్యాన్స్ చేస్తూనే కుప్పకూలిన యువకుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Viral Video: గ్రామాల్లో పెద్దలు అప్పట్లో ఓ సామేత చెప్పేవారటల.. వర్షం ఎప్పుడు వచ్చేది తెలియదు.. ప్రాణం ఎప్పుడు పోయేది తెలియదు.. అయితే.. ఆధునిక సమాజంలో టెక్నాలజీ ఎంతో పెరిగింది.. వర్షం ఎప్పుడు వస్తుంది.. ఏ ప్రాంతంలో ఎంత సమయం కురుస్తుంది అనేది ముందే పసిగడుతున్నారు.. ఇక, ఆరోగ్య సమస్యలను కూడా గుర్తించి.. సదరు వ్యక్తిఎంత కాలం జీవిస్తారు అనేది కూడా ముందే చెబుతున్నారు.. కానీ, కొందరు సరదాగా గడుపుతూ.. డ్యాన్స్‌లు వేస్తూ.. పాటలు పాడుతూ.. ఇంకా ఏదో పనిలో ఉంటూ.. కుప్పకూలి ప్రాణాలు వదిలిన ఘటనలు కూడా చోటు చేసుకుంటున్నాయి.. తాజాగా.. ఓ 32 ఏళ్ల యువకుడు.. పెళ్లి వేడుకల్లో జోష్‌గా డ్యాన్స్ చేస్తూ.. ఒక్కసారిగా కుప్పకూలి అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు..
Read Also: Astrology : జనవరి 19, గురువారం దినఫలాలు
Also Read
- Hyderabad: హనీట్రాప్ సైబర్ మోసం.. రిటైర్డ్ ఉద్యోగి నుంచి రూ.38 లక్షలు వసూలు.!
- Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
- Vijayawada Crime: విజయవాడలో కలకలం.. పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలిపై దాడి.. ప్రియుడు మృతి
- Uttar Pradesh: ‘‘మహిళ’’గా మారేందుకు అడ్డు చెప్పిందని తల్లి దారుణహత్య..
మధ్యప్రదేశ్‌లో జరిగిన ఆ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్కాన్పూర్కు చెందిన 32 ఏళ్ల అభయ్ సచాన్.. తన బంధువుల వివాహం కోసం మధ్యప్రదేశ్ రేవాకు వచ్చాడు. మంగళవారం రాత్రి వివాహ వేడుకలో హుషారుగా డ్యాన్స్‌లు చేశాడు. అలా గంతులేస్తూనే ఉన్నట్లుండి.. నెమ్మదిగా కుప్పకూలిపోయాడు.. అది గమనించిన బంధువుల.. వెంటనే ఆస్పత్రికి తరలించారు.. అయితే, కార్డియాక్ అరెస్ట్‌తో అప్పటికే ప్రాణాలు విడిచినట్టు వైద్యులు తెలిపారు. పెళ్లి వేడుకల్లో.. మద్యం తాగి జోష్‌గా డ్యాన్స్‌లు వేస్తుంటారు.. కానీ, ఇక్కడ షాకింగ్ విషయం ఏంటంటే.. అతను మద్యం సేవించిందిలేదు.. పరిపూర్ణ ఆరోగ్యవంతుడిగా ఉన్నాడని వైద్యులు చెబుతున్నారు.. ఆరోగ్యవంతుడైనా ఆ యువకుడు.. ఇలా కన్నుమూయడాన్ని కుటుంబసభ్యులు, బంధువులు జీర్ణించుకోలేకపోతున్నారు.. మొత్తంగా ఈ ఘటన పెళ్లింటి విషాదాన్ని నింపింది.. అయితే, పెళ్లి వేడుకల్లో డ్యాన్స్ చేస్తూ.. యువకుడు కుప్పకూలిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారిపోయింది..
18 Jan 2023 : 🇮🇳 : On Camera, Abhay Sachan(32) dancing at Wedding collapses and Dies due to 🫀arrest💉…
He is a resident of Uttar Pradesh's Kanpur districts, had come to Rewa for the wedding.#heartattack2023 #heartattack #cardiacarrest pic.twitter.com/FQFeZA3ZNa
— Anand Panna (@AnandPanna1) January 18, 2023
తాజావార్తలు
-
Jailer 2 : ‘జైలర్ 2’లో ఫ్యామిలీ ఎమోషన్స్ కు చోటు లేదా?.. నెల్సన్ దాచిన సర్ప్రైజ్ ఏంటి?
-
Rejinagar Bypoll: రెజినగర్ ఉప ఎన్నికలో హైటెన్షన్.. ఓటు వేసిన వెంటనే ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ అరెస్ట్
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Telangana Eagle Force: సింథటిక్ డ్రగ్స్‌పై ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం.. పరిశ్రమల నుంచి కొరియర్ సంస్థల వరకు నిఘా.!
-
Indian Railways: చార్ట్ సిద్ధమైనా రైలు టికెట్ బుక్ చేసుకోవచ్చు.. ఈ ప్రత్యేక రూల్ తెలుసా?
ట్రెండింగ్
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి