NTV Telugu Site icon

Viral Video: పెళ్లి వేడుకల్లో అపశృతి.. డ్యాన్స్‌ చేస్తూనే కుప్పకూలిన యువకుడు

Viral Video

Viral Video

Viral Video: గ్రామాల్లో పెద్దలు అప్పట్లో ఓ సామేత చెప్పేవారటల.. వర్షం ఎప్పుడు వచ్చేది తెలియదు.. ప్రాణం ఎప్పుడు పోయేది తెలియదు.. అయితే.. ఆధునిక సమాజంలో టెక్నాలజీ ఎంతో పెరిగింది.. వర్షం ఎప్పుడు వస్తుంది.. ఏ ప్రాంతంలో ఎంత సమయం కురుస్తుంది అనేది ముందే పసిగడుతున్నారు.. ఇక, ఆరోగ్య సమస్యలను కూడా గుర్తించి.. సదరు వ్యక్తిఎంత కాలం జీవిస్తారు అనేది కూడా ముందే చెబుతున్నారు.. కానీ, కొందరు సరదాగా గడుపుతూ.. డ్యాన్స్‌లు వేస్తూ.. పాటలు పాడుతూ.. ఇంకా ఏదో పనిలో ఉంటూ.. కుప్పకూలి ప్రాణాలు వదిలిన ఘటనలు కూడా చోటు చేసుకుంటున్నాయి.. తాజాగా.. ఓ 32 ఏళ్ల యువకుడు.. పెళ్లి వేడుకల్లో జోష్‌గా డ్యాన్స్‌ చేస్తూ.. ఒక్కసారిగా కుప్పకూలి అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు..

Read Also: Astrology : జనవరి 19, గురువారం దినఫలాలు

మధ్యప్రదేశ్‌లో జరిగిన ఆ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్‌కాన్పూర్‌కు చెందిన 32 ఏళ్ల అభయ్‌ సచాన్‌.. తన బంధువుల వివాహం కోసం మధ్యప్రదేశ్‌ రేవాకు వచ్చాడు. మంగళవారం రాత్రి వివాహ వేడుకలో హుషారుగా డ్యాన్స్‌లు చేశాడు. అలా గంతులేస్తూనే ఉన్నట్లుండి.. నెమ్మదిగా కుప్పకూలిపోయాడు.. అది గమనించిన బంధువుల.. వెంటనే ఆస్పత్రికి తరలించారు.. అయితే, కార్డియాక్‌ అరెస్ట్‌తో అప్పటికే ప్రాణాలు విడిచినట్టు వైద్యులు తెలిపారు. పెళ్లి వేడుకల్లో.. మద్యం తాగి జోష్‌గా డ్యాన్స్‌లు వేస్తుంటారు.. కానీ, ఇక్కడ షాకింగ్‌ విషయం ఏంటంటే.. అతను మద్యం సేవించిందిలేదు.. పరిపూర్ణ ఆరోగ్యవంతుడిగా ఉన్నాడని వైద్యులు చెబుతున్నారు.. ఆరోగ్యవంతుడైనా ఆ యువకుడు.. ఇలా కన్నుమూయడాన్ని కుటుంబసభ్యులు, బంధువులు జీర్ణించుకోలేకపోతున్నారు.. మొత్తంగా ఈ ఘటన పెళ్లింటి విషాదాన్ని నింపింది.. అయితే, పెళ్లి వేడుకల్లో డ్యాన్స్‌ చేస్తూ.. యువకుడు కుప్పకూలిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారిపోయింది..

Show comments