NTV Telugu Site icon

Uttar Pradesh: మూడేళ్ల పాపపై 10 ఏళ్ల బాలుడి అత్యాచారం..

Up News

Up News

Uttar Pradesh: దేశంలో రోజుకు ఎక్కడో చోట అత్యాచార ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. చిన్నా పెద్దా తేడా లేకుండా మహిళలపై కామాంధులు రెచ్చిపోతున్నారు. ఇదిలా ఉంటే మైనర్లు కూడా అత్యాచారాలకు పాల్పడుతుండటం సమాజాన్ని కలవరపరుస్తోంది. తెలిసీతెలియని వయసులో ఉన్న పిల్లలు కూడా ఇలాంటి ఘటనలకు పాల్పడటం షాక్ కు గురిచేస్తోంది. తాజాగా ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన సంఘటన సభ్యసమాజం తలదించుకునేలా ఉంది.

Read Also: Etela rajender: హుజురాబాద్ లో చర్చకు నువ్వు వస్తావా? నీ బానిసలు వస్తారా? సీఎంకు ఈటెల సవాల్‌..

పదేళ్ల వయసు ఉన్న ఒకటో తరగతి చదువుతున్న ఓ పిల్లాడు మూడేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ప్రస్తుతం బాలుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం తరలించారు. ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌ జిల్లాలో ఓ పాఠశాలలో మూడేళ్ల బాలికపై పదేళ్ల బాలుడు అత్యాచారానికి పాల్పడ్డాడని పోలీసు అధికారి ఆదివారం తెలిపారు. బాలిక కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు వివరాల ప్రకారం.. శనివారం బాలికను పాఠశాల పైకప్పుపైకి తీసుకెళ్లిన బాలుడు అత్యాచారానికి పాల్పడ్డాడు.

దేశంలో ఇలాంటి దారుణ ఘటనలు జరగడం ఇదే తొలసారి కాదు. గతేడాది ప్రారంభంలో మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో ఇలాంటి కేసు నమోదు అయింది. 12 ఏళ్ల బాలుడు మూడేళ్ల బాలికపై అత్యాచారం చేశాడు. బాలిక దుకాణానికి వెళ్లి వస్తున్న సమయంలో బాలుడు అడ్డగించి ఆమెకు చాక్లెట్లు కొనిస్తానని ఆశపెట్టి ఇంటికి తీసుకెళ్లి అత్యాచారానికి ఒడిగట్టాడు.