Mobile phone: గుజరాత్‌లోని అరవల్లి జిల్లాలో విషాదకర ఘటన వెలుగులోకి వచ్చింది. ఒక మహిళ ఆవేశపూరిత నిర్ణయం కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది. మొబైల్ ఫోన్ గురించి భర్తతో గొడవ పడిన భార్య ఆత్మహత్యకు పాల్పడింది. నేపాల్ కు చెందిన ఉర్మిళ ఖానన్ రిజన్ అనే మహిళ తన భర్త, బిడ్డతో కలిసి మోడసాలో నివసిస్తోంది. ఈ దంపతులకు ఆ ప్రాంతంలో ఒక చైనీస్ ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ ఉంది.
Read Also: iPhone 18 Pro: ఐఫోన్ 18 ప్రో డిజైన్ లీక్.. ఫ్యూచర్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ పూర్తి వివరాలు..!
ఉర్మిల తరుచుగా భర్తను మొబైల్ ఫోన్ కొనివ్వమని అడుగుతోంది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా భర్త పదే పదే నిరాకరిస్తూ వస్తున్నాడు. ఫోన్ కొనుగోలు చేయకపోవడంతో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. గొడవ తర్వాత ఉర్మిళ కోపంతో భవన్‌పూర్ సమీపంలోని తన నివాసంలో ఉరి వేసుకుని సూసైడ్ చేసుకుంది. ఈ ఘటనపై మోడసా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం పరీక్ష కోసం పంపారు.
