Site icon NTV Telugu

Crime News: పండుగ పూట దారుణం.. టపాసులు కాల్చొద్దు అన్నాడని హత్య చేసిన మైనర్లు

Diwali

Diwali

Crime News: పండుగ పూట దారుణం చోటుచేసుకొంది. టపాసుల విషయంలో జరిగిన గొడవలో ఒక వ్యక్తిని ముగ్గు మైనర్లు కలిసి హత్య చేసిన ఘటన ముంబైలో వెలుగు చూసింది. వివరాలలోకి వెళితే.. శివాజీ నగర్ లోని గోవండిలో ముగ్గురు మైనర్లు ఉదయం నుంచి టపాసులు పేలుస్తూనే ఉన్నారు. సీసాలో బాంబ్ లు పెట్టి కాలుస్తుండడంతో సీసా పెంకులు రోడ్డు మొత్తం పడుతున్నాయి. ఇక ఇది చూసిన ఒక 21 ఏళ్ల వ్యక్తి వారిని అడ్డుకున్నాడు. టపాసులు అలా కాల్చొద్దు అని చెప్పడంతో మైనర్లు వినలేదు.. అతడితో గొడవకు దిగారు. ఇలా మాటామాటా పెరిగి వారి మధ్య వాగ్వాదం చోటుచేసుకొంది.

ఇక ఆ కోపంతో ముగ్గురు మైనర్లలో ఒక కుర్రాడు చేతిలో ఉన్న చాకుతో సదురు వ్యక్తి మెడపై దారుణంగా పొడిచిపొడిచి చంపి పరారయ్యాడు. మిగతా మైనర్లు కూడా ఆ దారుణాన్ని చూసి పారిపోయారు. ఇక ఈ ఘటన గురించి తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు. ముగ్గురు మైనర్లు పరారీలో ఉన్నారని, వారికోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.

Exit mobile version