Site icon NTV Telugu

దారుణం: బాలికపై సాముహిక అత్యాచారం.. క్యాబ్ డ్రైవర్ తో సహా 17 మంది కలిసి నాలుగురోజుల పాటు

మహిళలకు సమాజంలో రక్షణ లేకుండా పోతుంది. ప్రభుత్వాలు ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా కామాంధులు మాత్రం మారడం లేదు. రోడ్డుపై ఆడవారు ఒంటరిగా కనిపిస్తే చాలు మగాళ్లు మృగాళ్ళుగా మారిపోతున్నారు. తాజాగా ఒక బాలికపై 18 మంది సామూహిక అత్యాచారం చేసిన అమానుష ఘటన కజికిస్థాన్ లో ఆలస్యంగా వెలుగుచూసింది. ఈ ఘటన జరిగి ఐదునెలలు అవుతున్నా పోలీసులు నిమ్మకు నీరెత్తినాట్లు ప్రవర్తిస్తుండటంతో బాధితురాలు తల్లి మీడియాను ఆశ్రయించడంతో ఈ ఘటన బయటపడింది.

వివరాలలోకి వెళితే.. కజికిస్థాన్ లోని ఒక ప్రాంతానికి చెందిన 16 ఏళ్ళ బాలిక షోపిక్ కోసమని బయటికి వెళ్లి, బస్సులు లేక క్యాబ్ బుక్ చేసుకొంది. క్యాబ్ డ్రైవర్ ఆమెకు మాయమాటలు చెప్పి మత్తుమందు కలిపిన కూల్ డ్రింక్ ని తాగించాడు. అనంతరం ఒక నది ఒడ్డుకు బాలికను తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. బాలిక స్పృహలోకి వచ్చి చూసేసరికి ఆమె నగ్నంగా కనిపించింది. పారిపోవడానికి ప్రయత్నించగా ఆమెను కొట్టి నదిలో ముంచి చంపేస్తానని బెదిరించిమరోమారు ఆమెను రేప్ చేశాడు.. అంతేకాకుండా అతడి స్నేహితులను పిలిచి ఒకరి తరువాత ఒకరు తనను రేప్ చేసారంటూ బాలిక ఆవేదన వ్యక్తం చేసింది.

నాలుగురోజులు ఒకరి తరువాత ఒకరు తనకు నరకం చూపించారని, ఆతరువాత తనను రోడ్డుపైకి విసిరి ఇష్టం ఉన్న చోట చెప్పుకో అని అన్నారని బాలిక వాపోయింది. ఇంటికొచ్చిన బాలిక తల్లికి జరిగిన విషయం చెప్పడంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపిన బాలిక తల్లి.. అక్కడ ఎవరు తమను పట్టించుకోలేదని, ఐదు నెలలు అవుతున్నా కనీసం విచారణ కూడా చేపట్టలేదని తెలిపింది. నా కూతురికి న్యాయం చేయాలనీ డిమాండ్ చేస్తూ ఆమె మీడియాముందుకు వచ్చి జరిగిన విషయాన్ని తెలిపింది. దీంతో కేసు సీరియస్ గా తీసుకున్న అధికారులు విచారణ కొనసాగిస్తామని తెలిపారు.

Exit mobile version