UP: యూపీలో మరో ఘోరం.. బాలికను కిడ్నాప్ చేసి కారులో గ్యాంగ్‌రేప్
- యూపీలో మరో ఘోరం
- బాలికను కిడ్నాప్ చేసి కారులో గ్యాంగ్‌రేప్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలో ఏదొక చోట మహిళలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. ఎన్ని కఠిన చట్టాలొచ్చినా మృగాళ్లలో మార్పు రావడం లేదు. ఓ వైపు కోల్‌కతా ఘటనపై దేశ వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నా.. కామాంధుల్లో మాత్రం భయం పుట్టడం లేదు. తాజాగా ఉత్తరప్రదేశ్‌లో మరో ఘోరం వెలుగులోకి వచ్చింది. 16 ఏళ్ల బాలికను కిడ్నాప్ చేసి.. యూపీ హైవేపై కారులో ఇద్దరు వ్యక్తులు అత్యాచారం చేశారు. నిందితుల్లో ఒకరిని పోలీసులు అరెస్ట్ చేశారు.
ఇది కూడా చదవండి: TSPSC: ఏళ్ల నిరీక్షణకు తెర.. గురుకుల ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితా విడుదల..
Also Read
- Child S*exual Abuse Content: ఇన్‌స్టాగ్రామ్‌లో చైల్డ్ ఫో*ర్న్ కంటెంట్ షేరింగ్.. వ్యక్తిపై కేసు నమోదు.!
- Shocking Murder Case: ఆస్తి కోసం సొంత బామ్మర్దినే చంపిన బావ.. 27 రోజుల తర్వాత బయటపడ్డ అసలు నిజం!
- Drunk and Drive: స్పీడ్.. డ్రింక్.. డెత్! హైదరాబాద్‌లో ఒకే రోజు ముగ్గురు బలి!
- Be Alert: కొండపై దొంగల ముఠా.. ఆదమరిస్తే అంతే..
ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలో మంగళవారం 16 ఏళ్ల బాలికపై ఇద్దరు వ్యక్తులు వాహనంలోనే సామూహిక అత్యాచారం చేశారు. అనంతరం నిందితులు ఆమెను బెదిరించి రోడ్డుపై వదిలేసి పరారయ్యారు. ముగ్గురు వ్యక్తులు మంగళవారం ఉదయం 6 గంటలకు ఆమెను కారులో కిడ్నాప్ చేసి.. హైవే వైపు తీసుకెళ్లారు. అందులో ఇద్దరు ఆమెపై అత్యాచారం చేశారు. ఇంటికి వచ్చిన బాలిక తన కుటుంబ సభ్యులకు జరిగిన ఘటనను వివరించింది. దీంతో కుటుంబ సభ్యులు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల్లో ఒకరిని అరెస్టు చేశారు.
ఇది కూడా చదవండి: Prabhas: ప్రభాస్ ఫ్యాన్స్‌కి ధైర్యమిచ్చిన ‘దెయ్యం’
బాధితురాలి తల్లి మీడియాతో మాట్లాడుతూ.. తన కుమార్తె ఉదయాన్నే బహిర్భూమికి వెళ్లిందన్నారు. అక్కడ ముగ్గురు వ్యక్తులు బలవంతంగా కారులోకి ఎక్కించుకుని వెళ్లిపోయారు. అనంతరం కారులో ఇద్దరు అత్యాచారం చేసినట్లు వెల్లడించింది. ఎంత సేపటికి రాకపోవడంతో సమీపంలో ఉన్న ప్రాంతాలను వెతికినట్లు చెప్పారు. కొద్దిసేపటికి కుమార్తె ఇంటికి వచ్చి జరిగిన ఘటనను చెప్పిందన్నారు. కారులో సామూహిక అత్యాచారం చేశారని తెలిపింది.
ఇక ఈ ఘటనపై ఆయా సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని, ఒక నిందితుడిని పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. బాలికను వైద్య పరీక్షలకు ఆస్పత్రికి పంపినట్లు పోలీసు అధికారి స్నేహ తివారీ తెలిపారు.
తాజావార్తలు
-
Raghunandan Rao: తెలంగాణలో రూ.200 కోట్ల సోలార్ స్కామ్.?.. రఘునందన్ రావు సంచలన ఆరోపణలు
-
Pocharam Srinivas Reddy: పోచారం సంచలన వ్యాఖ్యలు.. రేవంత్‌పై ఫైర్, బాన్సువాడలో మళ్లీ మనమే
-
Yashasvi Jaiswal: 29 టెస్టులు.. 29 వేదికలు.. ఇదెక్కడి వింత రికార్డు భయ్యా..
-
Pakistan: భారత్ నుంచి పాకిస్తాన్‌ను ‘‘బాగ్దాద్ ఒప్పందం’’ కాపాడలేదు.. ఇప్పుడు ‘‘ఇస్లామిక్ నాటో’’ పరిస్థితి కూడా అంతేనా?
-
KBR Park : కేబీఆర్ పార్క్ చుట్టూ ఇక వన్‌వే ట్రాఫిక్.. కొత్త నిబంధనలు అమల్లోకి.!
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..