Jaipur: టీనేజ్ బాలికపై మామ, అతని కొడుకు అత్యాచారం.. పరువు కోసం గర్భం తీయించిన కుటుంబం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jaipur: కంటికి రెప్పలా కాపాడాల్సిన వాడే కాటేశాడు. రాజస్థాన్ జైపూర్‌కి చెందిన 16 ఏళ్ల బాలికపై మామ, అతని కొడుకు కొన్ని నెలలుగా అత్యాచారానికి పాల్పడ్డారు. బాలిక గర్భం దాల్చడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. గత మూడు నెలలుగా బాలికపై ఇద్దరూ అత్యాచారానికి పాల్పడుతున్నారని, బాలిక గర్భవతి కావడంతో ఈ విషయం తెలిసిందని పోలీస్ అధికారులు వెల్లడించారు. బాలిక కుటుంబ సభ్యులు ఆమె గర్భంతో ఉందని గుర్తించి, పిండాన్ని తొలగించడానికి ఆస్పత్రికి వెళ్లినప్పుడు ఈ సంఘటన తెరపైకి వచ్చింది. నిందితులు ప్రస్తుతం పరారీలో ఉన్నారు, త్వరలో పట్టుకుంటామని పోలీసులు వెల్లడించారు.
Read Also: Bihar Politics: సీఎంగా నితీష్.. బీజేపీ నుంచి ఉప ముఖ్యమంత్రులుగా ఇద్దరు..
Also Read
- Korukonda Tragedy: వినాయక చవితి వేళ విషాదం.. కలువ పువ్వుల కోసం వెళ్లి ఇద్దరు మృతి
- Mother Murder Case: గుంటూరులో దారుణం.. ప్రియుడితో కలిసి తల్లిని హత్య చేసిన కూతురు..! డబ్బుల కోసమేనా..?
- Tragedy: ఘోర ప్రమాదం.. నిర్మాణంలో ఉన్న చర్చి పైకప్పు కూలి ముగ్గురు మృతి, 11 మందికి గాయాలు
- Kanchipuram Horror: రూ.20 వేల అప్పు కోసం బాలింత నిర్బంధం.. గుడారంలోనే ప్రసవం, తల్లీబిడ్డ మృతి
గతేడాది అక్టోబర్ నెలలో కుటుంబ సభ్యులు లేని సయమంలో నిందితులిద్ధరూ బాలికపై తొలిసారిగా లైంగిక దాడికి పాల్పడ్డారని, ఆ తర్వాత ఇద్దరూ పలుమార్లు బెదిరిస్తూ గత మూడు నెలలుగా ఆమెపై అనేక సార్లు అత్యాచారానికి ఒడిగట్టారని, బాలిక సోదరుడు ఇచ్చిన ఎఫ్ఐఆర్ పేర్కొంది. కడుపునొప్పి గురించి ఇంట్లో చెప్పడంతో, ఆమెను కుటుంబ సభ్యులు స్థానికంగా ఉన్న ఆస్పత్రికి గత సోమవారం తీసుకెళ్లారు, బాలిక రెండు నెలల గర్భవతి అని వైద్యులు కనుగొన్నారు. కుటుంబం పరువు కాపాడుకోవడానికి వారు వెంటనే పిండాన్ని తొలగించారు.
మొదటగా బాలిక ఈ ఘటనపై మాట్లాడేందుకు నిరాకరించనప్పటికీ.. తర్వాత సంఘటన గురించి వెల్లడించింది. ఆమెను ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసిన తర్వాత, నిందితులు ఇద్దరిపై కేసు నమోదు చేయడానికి బాలిక సోదరుడు శుక్రవారం సదర్ పోలీస్ స్టేషన్ వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్లు 376 డి, 376 ఎన్, అలాగే లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ (పోక్సో) చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అమ్మాయికి వైద్యపరీక్షలు నిర్వహించారు, నివేదిక కోసం పోలీసులు ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. నిజానిజాలు తేలిన వెంటనే నిందితులను పట్టుకుని, విచారిస్తామన్నారు.
తాజావార్తలు
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్‌పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!