Site icon NTV Telugu

Crime: 10 ఏళ్ల బాలుడిని హత్య చేసిన తల్లి లవర్..

Police

Police

Crime: 10 ఏళ్ల బాలుడిని అతడి తల్లి ప్రియుడు దారుణంగా హత్య చేశాడు. డెడ్ బాడీని సూట్ కేస్‌లో పెట్టి పొదల్లో విసిరినట్లు పోలీసులు ఆదివారం తెలిపారు. ఈ ఘటన అస్సాంలో జరిగింది. గౌహతి పోలీస్ డిప్యూటీ కమిషనర్ (తూర్పు) మృణాల్ డేకా మాట్లాడుతూ.. తన కుమారుడు ట్యూషన్ నుంచి ఇంటికి తిరిగి రాలేదని అతడి తల్లి శనివారం మిస్సింగ్ ఫిర్యాదు నమోదు చేసిందని చెప్పారు.

Read Also: Operation Sindoor: పాకిస్తాన్ ఫైటర్ జెట్‌లను కూల్చేశాం.. మన పైలట్‌లు సురక్షితం..

అయితే, దర్యాప్తులో పోలీసులు బాసిస్తా ఆలయం సమీపంలోని పొదల్లో ఒక సూట్‌కేస్ లో బాలుడిని మృతదేహాన్ని కనుగొన్నారు. బాలుడిని చంపేసి, అందులో పెట్టి పారేసినట్లు గుర్తించామని పోలీసులు తెలిపారు. బాలుడి తల్లి లవర్ ఈ హత్య చేసినట్లు ఒప్పుకున్నట్లు చెప్పారు. ఈ హత్యలో తల్లి ప్రమేయం ఉందా.? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. ఫోరెన్సిక్ టీంలు సంఘటనా స్థలం నుంచి ఆధారాలు సేకరించినట్లు డీసీపీ తెలిపారు.

Exit mobile version