సంధ్యా కన్వెన్షన్ ఎండీ శ్రీధర్ రావు పై కేసుల ఉచ్చు బిగుస్తున్న సంగతి తెలిసిందే. శ్రీధర్ రావుపై పలు పోలీస్ స్టేషన్ లో చీటింగ్, ల్యాండ్ కబ్జాలు, ఫోర్జరీ, బెదిరింపులు మోసాలు పాల్పడ్డ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు కమిషనరేట్ లో 16 కేసులు నమోదయ్యాయని తెలుస్తోంది.
2012లో బంజారాహిల్స్ లో సంధ్య శ్రీధర్ రావు పై కేసు వుంది. 2016లో శ్రీధర్ రావు పై సీసీఎస్ లో కేసు నమోదయింది. 2017 లో సీసీఎస్‌లో ల్యాండ్ గ్రాబింగ్ కేసు వుంది. 2018లో గచ్చిబౌలి లో ల్యాండ్ కబ్జా కేసు కూడా శ్రీధర్ రావుపై నమోదైంది. 2018లో నార్సింగి పోలీస్ స్టేషన్లో కేసు నమోదయింది. 2019లో జూబ్లీహిల్స్‌లో ఫోర్జరీ కేసు పెట్టారు. 2010లో మలక్ పేట్ లో చీటింగ్ కేసు వుంది.
అంతేకాదు 2020 లో జూబ్లీహిల్స్ 420 కేసు నమోదు చేశారు. 2021లో రాయదుర్గం శ్రీధర్ పై కేసు నమోదయింది. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో 3 చీటింగ్ కేసులు నమోదు చేశారు. నార్సింగి పోలీస్ స్టేషన్లో రెండు కేసులు, మియాపూర్ పోలీస్ స్టేషన్ లో ఒక్క ఛీటింగ్ కేసు వుంది.