NTV Telugu Site icon

రివ్యూ: సెబాస్టియ‌న్ పి.సి. 524

sebastian pc 524 movie review

sebastian pc 524 movie review

న‌టీన‌టులు : కిరణ్‌ అబ్బవరం, కోమలీ ప్రసాద్‌, నువేక్ష (నమ్రతా దారేకర్‌), శ్రీకాంత్‌ అయ్యంగార్‌, సూర్య, రోహిణీ రఘువరన్‌, ఆదర్ష్‌ బాలకృష్ణ, జార్జ్‌, సూర్య, మహేష్‌ విట్టా, రవితేజ, రాజ్‌ విక్రమ్‌, లత, ఇషాన్‌, రాజేష్‌
సంగీతం: జిబ్రాన్
కెమెరా: రాజ్ కె.న‌ల్లి
నిర్మాత‌లు: సిద్ధారెడ్డి, జ‌య‌చంద్ర రెడ్డి
క‌థ, ద‌ర్శ‌క‌త్వం: బాలాజీ స‌య్య‌పురెడ్డి

ఈ మ‌ధ్య కాలంలో జ‌నాన్ని ఆక‌ట్టుకున్న కుర్ర హీరోల్లో కిర‌ణ్ అబ్బ‌వ‌రం కూడా ఉన్నారు. అత‌ను న‌టించిన ఎస్.ఆర్.క‌ళ్యాణ మండ‌పం గ‌త సంవ‌త్స‌రం జ‌నాన్ని భ‌లేగా అల‌రించింది. అప్పుడే అత‌ను హీరోగా జ‌నం దృష్టిని ఆక‌ర్షించారు. అంత‌కు ముందు అత‌ను న‌టించిన రాజావారు-రాణిగారు కూడా అప్పుడు జ‌నానికి గుర్తుకు వ‌చ్చింది. దాంతో కిర‌ణ్ న‌టించిన తాజా చిత్రం సెబాస్టియ‌న్ పి.సి. 524పై ప‌లువురి దృష్టి మ‌ళ్ళింది. ఈ చిత్రం బాలాజీ స‌య్య‌పురెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కింది. ల‌వ్, సెంటిమెంట్, క్రైమ్ క‌ల‌గ‌లుపుగా సెబాస్టియ‌న్ పి.సి.524 తెర‌కెక్కింది.

ఇక సెబాస్టియ‌న్ పి.సి. 524 క‌థ‌లోకి తొంగి చూస్తే – సెబాస్టియ‌న్ కు రేచీక‌టి. అందువ‌ల్ల అత‌నికి రాత్రి అంటే అస‌లు గిట్ట‌దు. అలాంటి సెబాస్టియ‌న్ చిత్రంగా పోలీస్ అవుతాడు. త‌న‌కు రాత్రి డ్యూటీ వేయ‌వ‌ద్ద‌ని ఇన్ స్పెక్ట‌ర్ ను అడుగుతాడు. అయినా ఎవ‌రూ ప‌ట్టించుకోరు. సెబాస్టియ‌న్ కు రేచీక‌టి అన్న విష‌యం న‌లుగురికి మాత్ర‌మే తెలుసు. ఒక‌టి అత‌ని త‌ల్లి, రెండు అత‌ని చిన్న‌నాటి మిత్రుడు, అత‌నికి ట్రీట్ చేసే డాక్ట‌ర్, అత‌ని ప్రేయ‌సి. ఓ రోజు సెబాస్టియ‌న్ కు ఓ ఇంటి ద‌గ్గ‌ర డ్యూటీ వేస్తారు. అక్క‌డ ఓ అమ్మాయి చ‌నిపోతుంది. రాత్రి స‌రిగా క‌నిపించ‌ని సెబాస్టియ‌న్ ఉద‌యం పోలీసు అధికారుల ముందు దోషిగా నిలుస్తాడు. అత‌ని ఉద్యోగం పోతుంది. త‌రువాత సెబాస్టియ‌న్ తల్లి నీకు ఏమి ఉన్నా అది వేరే. కానీ, న్యాయం మాత్రం గెల‌వాలి అంటుంది. దాంతో త‌ల్లిపై గౌర‌వంతో ఈ కేసును సొంత‌గా ఇన్వెస్టిగేట్ చేయ‌డం మొద‌లు పెడ‌తాడు సెబాస్టియ‌న్. అదే స‌మ‌యంలో అత‌ని మిత్రుడు విదేశాల‌కు వెళ్లి ఉంటాడు. సెబాస్టియ‌న్ మాత్రం ప‌ట్టు వ‌ద‌ల‌ని విక్ర‌మార్కునిలా కేసును గాలిస్తూనే ఉంటాడు. అత‌ని మిత్రుడు రెండేళ్ళ త‌రువాత స్వ‌దేశం వ‌స్తాడు. రెండేళ్ళ‌యినా ఆ కేసునే ప‌ట్టుకు ఊగులాడుతున్నావా అని ప్ర‌శ్నిస్తాడు. ఆధారాల‌న్నీ ప‌క్కాగా దొరికిన త‌రువాత అస‌లు నేర‌స్థుడు త‌న చిన్న‌నాటి మిత్రుడే అని సెబాస్టియ‌న్ కు తెలుస్తుంది సెబాస్టియ‌న్ ఫ్రెండ్ ఓ అమ్మాయిని ప్రేమించి ఉంటాడు. కానీ, ఆ అమ్మాయి మరొక‌రిని పెళ్ళాడుతుంది. త‌ల్లి కాబోతూఉంటుంది. త‌న‌కు ద‌క్క‌ని ఆమె జీవించ‌రాద‌ని అత‌ను ఆమెకు విషం క‌లిపిన కేక్ ఇచ్చి ఉంటాడు. ఆ ఆధారాల‌న్నీ సెబాస్టియ‌న్ సంపాదించి ఉంటాడు. న్యాయం గెల‌వాలి అన్న త‌ల్లి మాట‌కు గౌర‌వమిస్తూ, చిన్న‌ప్పుడు రాత్రి పూట క‌ళ్లు క‌న‌ప‌డ‌క బ‌స్సు కింద ప‌డ‌బోతుంటే త‌న‌ను ర‌క్షించిన స్నేహితుడినే చ‌ట్టానికి అప్ప‌గిస్తాడు సెబాస్టియ‌న్.

ఈ క్రైమ్ డ్రామాలో త‌గిన సెంటిమెంట్ కూడా చొప్పించారు ద‌ర్శ‌కుడు బాలాజీ. సెబాస్టియ‌న్ గా కిర‌ణ్ అబ్బ‌వ‌రం స‌ర‌దాగా న‌టించారు. కామెడీ బాగానే సాగింద‌నిపిస్తుంది. జిబ్రాన్ సంగీతం అల‌రిస్తుంది. రాజాధి రాజా... అంటూ సాగే నేప‌థ్య గీతం ఆక‌ట్టుకుంది. ద‌ర్శ‌కుడు కొత్త అయినా అది క‌నిపించ‌నీయ‌కుండా చేశారు. ఇందులో త‌ల్లిగా న‌టించిన‌ రోహిణి త‌ప్పిస్తే, మిగిలిన తార‌ల న‌ట‌నకు అంతగా అవ‌కాశం లేద‌నే చెప్పాలి.

ప్ల‌స్ పాయింట్స్:

మైన‌స్ పాయింట్స్:

రేటింగ్ : 2.5/5
ట్యాగ్: 524 ఫ‌ర్ ప‌న్!