NTV Telugu Site icon

Raman Subba Row: మాజీ టెస్ట్ క్రికెటర్, ఐసీసీ మ్యాచ్ రిఫరీ మృతి..

6

6

ఇంగ్లండ్ మాజీ ఓపెనర్, ఐసీసీ మ్యాచ్ రిఫరీ రామన్ సుబ్బా రో 92 సంవత్సరాల వయస్సులో మరణించారు. 1958 – 1961 మధ్య ఇంగ్లండ్ జట్టుకు 13 టెస్ట్ మ్యాచ్‌ లలో 46.85 సగటుతో, మూడు సెంచరీలు చేసాడు సుబ్బా రో. ఆ తర్వాత అతను సర్రే టీంకు ఛైర్మన్ అయ్యాడు. ఇక ఈసీబీ టెస్ట్ మరియు కౌంటీ క్రికెట్ బోర్డ్ (TCCB) ఏర్పాటుకు సహాయం చేసాడు. అతను క్రికెట్‌ లో భాగంగా పబ్లిక్ రిలేషన్స్ కంపెనీని ప్రారంభించాడు.

ALSO READ: Sekhar Kammula : “లీడర్ 2” తప్పకుండా చేస్తా.. కానీ..?

ఇక ఈయన మరణవార్తతో.. ఈసీబీ చైర్‌ రిచర్డ్‌ థాంప్సన్‌ మాట్లాడుతూ.. రామన్‌ మరణవార్త విని చాలా బాధపడ్డాం. “అతను గొప్ప క్రికెట్, మనిషి. అతని అద్భుతమైన క్రికెట్ కెరీర్ మైదానంలో, వెలుపల విజయాలని సాధించింది. ఆటగాడిగా, అధికారిగా, నిర్వాహకుడిగా, సర్రే మరియు టెస్ట్ మరియు కౌంటీ క్రికెట్ బోర్డు రెండింటికీ అధ్యక్షుడిగా తన బాధ్యతలను సక్రమంగా నిర్వహించారు. మా ఆట అతనికి కృతజ్ఞతతో కూడింది. ఈ విషాద సమయంలో రామన్ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులకు మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము అని ఆయన తెలిపారు.

ALSO READ: Pushpa 2: ఆ భాషలో కూడా రిలీజ్ అవుతున్న ‘పుష్ప 2’!

ఈయన మరణానికి ముందు, అతను ఇంగ్లండ్‌ లో జీవించి ఉన్న పురుషుల టెస్టు క్రికెట్‌లో అత్యంత వృద్ధుడు. స్ట్రీథమ్‌ లో జన్మించిన సుబ్బా రో 1953లో తన సర్రే అరంగేట్రం చేసాడు. స్టువర్ట్ సర్రిడ్జ్ నేతృత్వంలోని జట్టు కోసం ఆడాడు. ఆ జట్టు ఏడు వరుస కౌంటీ ఛాంపియన్‌షిప్‌ లను గెలుచుకుంది. సుబ్బా రో ఫస్ట్ క్లాస్‌లో పదేళ్ల వ్యవధిలో 260 మ్యాచ్‌లు ఆడాడు, 14,000 పైగా పరుగులు సాధించాడు. అలాగే అతని లెగ్‌ స్పిన్‌ తో 87 వికెట్లు సాధించాడు. 1991లో క్రికెట్‌కు చేసిన సేవలకుగానూ అతనికి CBE లభించింది. 1992 – 2001 మధ్య అతను ఐసీసీకి మ్యాచ్ రిఫరీగా 41 టెస్టులు, 119 ఒన్డే లను పర్యవేక్షించాడు.

ఇది ఇలా ఉండగా.. రామన్‌ సుబ్బా రో తండ్రి పంగులూరి వెంకట సుబ్బారావు. వీరు ఆంధ్రప్రదేశ్‌ లోని బాపట్లకు చెందిన వారు. సుబా​ రో తల్లి డోరిస్ మిల్డ్రెడ్ పిన్నర్. ఆవిడ బ్రిటన్‌ మహిళ. రామన్‌ సుబ్బా రో తండ్రి ఉన్నత చదువుల కోసం లండన్‌కు వెళ్లగా అక్కడ డోరిస్ మిల్డ్రెడ్ పిన్నర్‌ తో పరిచయం ఏర్పడి, అదికాస్తా ప్రేమగా మారి, పెళ్లికి దారి తీసింది. వీరిద్దరి సంతానమే రామన్‌ సుబ్బా రో.