NTV Telugu Site icon

Zomato: ‘‘ప్యూర్ వెజ్ మోడ్’’ని ప్రారంభించిన జొమాటో.. వారి కోసం ప్రత్యేకం..

Zomato

Zomato

Zomato: ప్రముఖ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫారమ్ ‘జొమాటో’(Zomato) శాఖాహారుల కోసం సరికొత్తగా రాబోతోంది. శాఖాహార వినియోగదారుల్ని దృష్టిలో పెట్టుకుని పూర్తిగా ‘ప్యూర్ వెజ్ మోడ్’ని ప్రారంభించింది. వెజిటేరియన్ల కోసం ‘‘ప్యూర్ వెజ్ ప్లీట్’’ ద్వారా డెలివరీలు అందించబడుతాయి. జొమాటో సాంప్రదాయ డ్రెస్ కోడ్‌కి బదులుగా గ్రీన్ యూనిఫాం, గ్రీన్ డెలివరీ బ్యాగ్స్‌ని కలిగి ఉంటుంది. ఇప్పుడు రెడ్ యూనిఫాం, రెడ్ డెలివరీ బాక్సులు నాన్-వెజ్‌కి పరిమితం కానున్నాయి.

Read Also: Man stabs wife: మధ్యాహ్న భోజనం ఆలస్యమైందని భార్యని చంపిన భర్త..

‘‘ప్రపంచంలో అత్యధిక శాఖాహారులు భారతదేశంలోనే ఉన్నారు. వారు తమ ఆహారాన్ని ఎలా వండుతారు, ఎలా ఆహారాన్ని నిర్వహిస్తారనే విషయంలో వారు చాలా ప్రత్యేకంగా ఉంటారు. వారి నుంచి మేము పొందిన అభిప్రాయాల్లో ఇది ముఖ్యమైంది’’ అని జొమాటో సీఈఓ దీపిందర్ గోయల్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. వెజిటేరియన్ల ఆహార ప్రాధాన్యతలను పరిష్కరించడానికి ‘‘ప్యూర్ వెజ్ మోడ్’’ ప్రారంభించామని చెప్పారు.

ప్యూర్ వెజ్ మోడ్ పూర్తిగా శాఖాహారాన్ని అందించే రెస్టారెంట్లు మాత్రమే ఉంటాయి. రాబోయే కొద్ది వారాల్లో దేశవ్యాప్తంగా దశల వారీగా ఈ డెలివరీ సిస్టమ్ అందుబాటులోకి రానుంది. మాంసాహార భోజనం లేదా నాన్ వెజ్ రెస్టారెంట్లు అందించే వెజ్ భోజనం ప్యూర్ వెజ్ ప్లీట్ కోసం ఉద్దేశించిన గ్రీన్ డెలివరీ బాక్సుల్లో ఎప్పటికీ వెళ్లదని గోయల్ చెప్పారు. అయితే, ఈ ప్రకటనపై సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన ఎదురవుతోంది. చాలా మంది దీన్ని కొత్త మార్కెటింగ్ టెక్నిక్ అని ప్రశంసించగా.. అయితే, పలువురు దీన్ని వివక్షాపూరితంగా విమర్శించారు. కొన్ని హౌసింగ్ సొసైటీలు రెడ్ డ్రెస్ కోడ్ కలిగిని జొమాటో డెలివరీ వ్యక్తులను అనుమతించవని ఓ నెటిజన్ కామెంట్ చేశారు. కొందరు మొబైల్ ఫోన్ల నుంచి యాప్ తొలగించాలని పిలుపునిచ్చారు. దీనిపై సీఈఓ దీపిందర్ గోయల్ క్లారిటీ ఇచ్చారు. ఈ చర్య ఏ మతపరమైన లేదా రాజకీయ ప్రాధాన్యతకు దోహదపడదని ఆయన స్పష్టం చేశారు.