Site icon NTV Telugu

Youtube Shorts: యూట్యూబ్‌ షార్ట్స్‌.. తెరిచిన ద్వారం..

Youtube Shorts2

Youtube Shorts2

Youtube Shorts: మన దేశంలో మొబైల్‌ ఫస్ట్‌ క్రియేటర్స్‌కి యూట్యూబ్‌ షార్ట్స్‌ తెరిచిన ద్వారమని ఆసియా-పసిఫిక్‌ రీజనల్‌ డైరెక్టర్‌ విద్యాసాగర్‌ అన్నారు. రెండేళ్ల కిందట తొలిసారిగా ఇండియాలోనే యూట్యూబ్‌ షార్ట్స్‌ను ప్రవేశపెట్టామని గుర్తుచేశారు. యూట్యూబ్‌లో షార్ట్‌-ఫామ్‌ కంటెంట్‌ని క్రియేట్‌ చేయటం మరియు ఈజీగా వీక్షించటం కోసం వీటికి రూపకల్పన చేశామని చెప్పారు. యూట్యూబ్‌ షార్ట్స్‌.. ప్రపంచవ్యాప్తంగా ఒకటిన్నర బిలియన్‌ల కన్నా ఎక్కువ మంత్లీ లాగిన్‌ చేసే యూజర్స్‌ కమ్యూనిటీని పెంచుకున్నాయి. యూట్యూబ్‌ షార్ట్స్‌కి రోజుకి 30 బిలియన్‌ల వ్యూస్‌ జనరేట్‌ అవుతున్నాయి. గతేడాదితో పోల్చితే ఇది 4 రెట్లు కావటం విశేషం. ఈ రోజుల్లో పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతిఒక్కరూ యూట్యూబ్ షార్ట్స్ పట్ల ఆసక్తి కనబరుస్తున్న సంగతి తెలిసిందే.

‘క్యురేషియొ హెల్త్‌ కేర్‌’ని అక్వైర్ చేసిన టొరెంట్‌

అహ్మదాబాద్‌కు చెందిన టొరెంట్‌ ఫార్మాస్యుటికల్స్‌.. కాస్మెటిక్స్‌ డెర్మటాలజీ కంపెనీ క్యురేషియొ హెల్త్‌ కేర్‌ను 2 వేల కోట్ల రూపాయలకి అక్వైర్‌ చేసుకునేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. ఈ డీల్‌తో దేశీయ డెర్మటాలజీ మార్కెట్‌లో టొరెంట్‌ స్థానం ఒక్కసారిగా 11 పాయింట్లు పెరిగింది. 21 నుంచి 10కి చేరింది. క్యురేషియొ సంస్థ ఇండియాతోపాటు నేపాల్‌, శ్రీలంక, ఫిలిప్పీన్స్‌ దేశాల్లో కార్యకలాపాలను నిర్వహిస్తోంది. టొరెంట్‌ ఫార్మా బాధ్యతలను అమన్‌ మెహతా స్వీకరించాక ఇదే మొట్టమొదటి మేజర్‌ అక్విజిషన్‌ కావటం చెప్పుకోదగ్గ విషయం.

Telangana and Four other rich States: 38 శాతం రిజిస్ట్రేషన్లు తెలంగాణ సహా ఆ 5 సంపన్న రాష్ట్రాల్లోనే..

నియామకాల జోరు.. ఐటీదే మేజర్‌ షేరు..

కొవిడ్‌ అనంతరం కార్పొరేట్‌ ఇండియాలో నియామకాల జోరు నెలకొంది. ఇందులో మిగతా సెక్టార్లతో పోల్చితే ఐటీ రంగం ముందు వరుసలో ఉంది. 2021తో పోల్చితే ఈ ఏడాది జాబ్‌ క్రియేషన్‌ పేస్‌ 8 పాయింట్‌ 5 శాతానికి పెరిగింది. ఈ స్టడీని గ్లోబల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంక్‌ జఫరీస్‌ నిర్వహించింది. అధ్యయనంలో భాగంగా 760 లిస్టెడ్‌ కంపెనీలను పరిగణనలోకి తీసుకుంది. అయితే.. అనార్గనైజ్డ్‌ సెక్టార్‌లో మాత్రం ఈ రిక్రూట్‌మెంట్‌ బూమ్‌ లేదని, కేలండర్‌ ఇయర్‌ చివరి నాటికి గ్రోత్‌ నమోదుకావచ్చని ఆశాభావం వ్యక్తం చేసింది.

Exit mobile version