స్మార్ట్ ఫోన్లను లాక్ చేయడానికి చాలా మంది ఫింగర్ ప్రింట్‌లను వినియోగిస్తుంటారు. ఫింగర్ ప్రింట్ కోసం సెన్సార్ స్క్రీన్ కింది భాగంలో ఉంటుంది. లేదంటే ఫోన్ వెనుక భాగంలో ఉంటుంది. అయితే, స్మార్ట్ ఫోన్ దిగ్గజం షావోమీ మరో అడుగు ముందుకు వేసి కొత్త టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. టచ్ స్క్రీన్ మొత్తాన్ని స్క్రానర్‌గా మార్చేసింది. స్క్రీన్‌పై ఎక్కడ టచ్ చేసినా ఫోన్ అన్‌లాక్ అవుతుంది. దీనికి సంబంధించి పేటెంట్ కోసం ఇప్పటికే షావోమీ సిద్దమైంది.
Read: ‘ఉనికి’ ట్రైలర్: కలెక్టర్ సుబ్బలక్ష్మీ పై దాడి చేసిందెవరు..?
ఈ ఆల్ టచ్ స్క్రీన్ సెన్సార్ విధానాన్ని 2020లో మొదట హువావే కంపెనీ పేటెంట్ కోసం ధరఖాస్తు చేసుకుంది. ఆపిల్ సంస్థ కూడా ఈ విధానాన్ని అందుబాటులోకి తీసుకొస్తామని చెబుతున్నది. కానీ, హువావే, ఆపిల్ కంపెనీలు ఇప్పటి వరకు ఈ విధానాన్ని అందుబాటులోకి తీసుకురాలేకపోయాయి. షావోమీ ఈ ఆల్ టచ్ స్క్రీన్ అన్ లాక్ విధానం అందుబాటులోకి రానున్నడంతో ఎంతవరకు ఈ విధానం సక్సెస్ అవుతుందో చూడాలి.