‘ఉనికి’ ట్రైలర్: కలెక్టర్ సుబ్బలక్ష్మీ పై దాడి చేసిందెవరు..?

ఆశిష్‌ గాంధీ, చిత్ర శుక్లా జంటగా రాజ్‌కుమార్‌ బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఉనికి’. బాబీ ఏడిద, రాజేష్‌ బొబ్బూరి నిర్మిస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 15 న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే మేకర్స్ ప్రమోషన్ల జోరు పెంచారు. ప్రమోషన్లలో భాగంగా ఈ సినిమా ట్రైలర్ ని మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ రిలీజ్ చేసి చిత్ర బృందానికి బెస్ట్ విషెస్ తెలిపారు. ఇక ట్రైలర్ విషయానికొస్తే.. ఆధ్యంతం ఆకట్టుకొంటుంది. ఒక ఊరికి కలెక్టర్ గా వచ్చిన సుబ్బలక్ష్మి అన్యాయాన్ని ఎదిరించి నీతిగా ప్రజలకు సేవ చేస్తుంటుంది. అయితే ఇంతలోనే ఆమెపై కొంతమంది దుండగులు దాడి చేస్తారు. ఆ దాడి ఎవరు చేశారు..? దీని వెనుక ఉన్నది ఎవరు అనేది కనుక్కోవడానికి సుబ్బలక్ష్మి ప్రియుడు, పోలీసాఫీసర్ అభి వస్తాడు. దీంతో కథ మలుపు తిరుగుతుంది.

ఇన్వెస్టిగేషన్.. అభి ఎత్తులకు పై ఎత్తులు వేసే ఒక ముసుగు మనిషి.. మరోపక్క సుబ్బలక్ష్మి పనులకు అడ్డు తగిలే రాజకీయ నాయకులు. చివరికి ఈ కథలో అబ్ పావు గా మారిపోయినట్లు చూపించారు.  ఓ మధ్య తరగతి యువతి తనకెదురైన గడ్డు పరిస్థితుల నుంచి తన ఉనికి నిలుపుకోవడం కోసం ఎలా పోరాడింది? అనేది. కలెక్టర్ సుబ్బలక్ష్మిపై దాడి చేసిన ముసుగు మనిషి ఎవరు..? అతడిని అభి పట్టుకున్నాడా..? అనేది ట్విస్ట్ గా చూపించారు. పి.ఆర్ సంగీతం ఆకట్టుకొంది. మరి ఈ సినిమా సంక్రాంతికి ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

Related Articles

Latest Articles