Site icon NTV Telugu

Electric Vehicles: ఇండియాలో మ‌రో రెండు హైస్పీడ్ ఈవీ స్కూట‌ర్స్‌…

దేశంలో ఎల‌క్ట్రిక్ వాహ‌నాల వినియోగం క్ర‌మంగా పెరుగుతున్న‌ది. ఇప్ప‌టికే అనేక స్టార్ట‌ప్ కంపెనీలు ఎల‌క్ట్రిక్ వాహ‌నాల‌ను త‌యారు చేస్తున్నాయి. కొత్త కొత్త వాహానాలు అందుబాటులోకి రావ‌డంతో ధ‌ర‌లు కూడా సామాన్యుల‌కు అందుబాటులోకి వ‌స్తున్నాయి. ఇక ఇదిలా ఉంటే, భార‌త్‌కు చెందిన వార్డ్ విజార్డ్ సంస్థ రెండు ఎల‌క్ట్రిక్ వాహ‌నాల‌ను విప‌ణిలోకి విడుద‌ల చేసింది. వొల్ఫ్ +, నాను + అనే రెండు వాహ‌నాల‌ను విప‌ణిలోకి ప్ర‌వేశ‌పెట్టింది. యువ‌త‌ను ల‌క్ష్యంగా చేసుకొని ఈ వాహ‌నాల‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. వోల్ప్ ప్ల‌స్ బైక్ వీల్‌బేస్ ను కాస్త పొడిగించింది. అంతేకాదు, సీటు కూడా వెడ‌ల్పుగా ఉంటుంది.

Read: Indian Prisons: భార‌తీయ ఖైదీలు అత్య‌ధికంగా ఆ దేశంలోనే ఉన్నారు…

సిటీస్‌లో ట్రాఫిక్‌ను దృష్టిలో ఉంచుకొని దీనిని త‌యారు చేశారు. ఇక ఈ ఎల‌క్ట్రిక్ బైకులు కీ తో పాటు కీలెస్ ఆప్ష‌న్ల‌తో అందుబాటులోకి వ‌చ్చాయి. గుజరాత్ లోని వ‌డోద‌ర కేంద్రంగా ఈ బైక్‌ల‌ను త‌యారు చేస్తున్నారు. ఈ రెండు బైక్స్‌లో రీజ‌న‌రేటివ్ బ్రేకింగ్ సిస్ట‌మ్‌ను అమ‌ర్చారు. బ్రేక్ వేసేందుకు బ్రేక్ లివ‌ర్‌ను లాగిన‌పుడు బ్యాట‌రీ రీచార్జ్ అవుతుంది. ఈ బైక్‌ల‌ను ఒక‌సారి రీచార్జ్ చేస్తే 100 కిలోమీట‌ర్లు ప్ర‌యాణం చేయ‌వ‌చ్చు. వోల్ఫ్ ప్ల‌స్ బైక్ ధ‌ర రూ. 1,10,185 కాగా, నానో ప్ల‌స్ బైక్ ధ‌ర 1,06,991గా ఉంది.

Exit mobile version