క్రెడిడ్ స్కోర్ బాగున్నప్పటికి మీకు బ్యాంక్ నుంచి లోనే శాంక్షన్ కాలేదా.. దానికి మీ క్రెడిట్ స్కోర్ ఒక్కటే కారణం అయ్యి ఉండకపోవచ్చు. ఎందుకంటే బ్యాంకులు మనకు లోన్ ఇవ్వాలంటే ముఖ్యంగా..క్రెడిట్ స్కోర్ మాత్రమే చూడదు… మీ ఆదాయం.. జాబ్ స్టాండర్డ్.. గతంలో లోన్ తీసుకుని కట్టకుండా ఉన్న వాటిని కూడా పరిశీలింస్తుంది. మొదటి సారి లోన్ తీసుకునే వారిని స్కోర్ ఆధారంగా రిజెక్ట్ చేయకూడదని ఆర్బీఐ వెల్లడించింది. స్థిరమైన ఉద్యోగం, తక్కువ అప్పులు ఉన్నవాళ్లకు రుణాలు వెంటనే పొందే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
Read Also: Accident: లారీని ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు.. ఇద్దరు మృతి.. ఆరుగురికి తీవ్రగాయాలు
క్రెడిట్ స్కోర్ ఆధారంగా మాత్రమే మీకు లోన్ లభిస్తుందనే ఉత్తమాటే.. లోన్ ఇచ్చేముందు బ్యాంకులు మీకు ఉద్యోగ భద్రత ఉందా.. మీ ఆర్థిక పరిస్థితి పరువాలేదా అన్ని ఒకటికి రెండు సార్లు అంచనా వేసి ఆ తరువాతే రుణాలు మంజూరు చేస్తుంటాయి. సాధారణంగా ఆదాయం, ప్రస్తుత ఆర్థిక బాధ్యతలను అంచనా వేసిన తర్వాత మాత్రమే నిర్ణయం తీసుకోవాలని బ్యాంకులకు సూచించబడింది. మీకు నెలసరి ఆదాయంలో ఎక్కువ శాతం అంటే.. 40-50 శాతం కంటే ఎక్కువ EMI కడుతుంటే.. మాత్రం మీకు కొత్త రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు సుముఖత వ్యక్తం చేయవచ్చని బ్యాంకు నిపుణులు చెబుతున్నారు.
Read Also:Man Escapes Death: ఇతడికి ఇంకా భూమ్మీద నూకలున్నాయి.. పట్టాలు దాటుతుండగా కదిలిన రైలు..
ఒకేసారి ఒకటి కంటే ఎక్కువ లోన్లు.. క్రెడిట్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవడంతో కూడా.. మీకు లోన్లు రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మీరు గతంలో EMIలను కోల్పోయి ఉన్నా.. లేదా అదే బ్యాంకులో రుణాలు సెటిల్ చేసి ఉన్నా.. బ్యాంకులు మీకు లోన్లు ఇచ్చేందకు వ్యతిరేకంగా ఉండవచ్చంటున్నారు. కస్టమర్ ఆర్థిక బలం, రుణం తిరిగి చెల్లించే సామర్థ్యం, ఉద్యోగ భద్రత వంటి ఇతర అంశాలను అంచనా వేయాలని ఆర్బీఐ బ్యాంక్ లకు గైడ్ లైన్స్ అందజేసింది. అయితే బ్యాంక్ లు లోన్లు ఇవ్వడం అనేది.. క్రెడిట్ స్కోర్ పై కాకుండా.. మీ ఆర్థిక ప్రోఫైల్ పై కూడా ఆధారపడి ఉండవచ్చని నిపుణులు అంటున్నారు. ఈ విషయాన్ని మేము పూర్తిగా ఇంటర్నెట్ నుంచి గ్రహించాము. మీకు ఏదైనా సందేహాలు ఉంటే.. బ్యాంక్ ఎక్స్ పర్ట్స్ ను స్వయంగా కలిసి.. మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు.
