Site icon NTV Telugu

Whatsapp: వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. ఇకపై తప్పుడు సమాచారానికి చెక్..!!

యూజర్లకు ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను అందిస్తున్న వాట్సాప్ మరో ఫీచర్‌ను త్వరలో అందుబాటులోకి తేనుంది. ఈ ఫీచర్ సహాయంతో గ్రూప్ అడ్మిన్లుగా ఉన్న వ్యక్తులు గ్రూప్ సభ్యులు షేర్ చేసే మెసేజ్‌లను సులువుగా తొలగించవచ్చు. గ్రూప్‌లో ఎవరైనా తప్పుడు సమాచారాన్ని షేర్ చేస్తే గ్రూప్ అడ్మిన్ సదరు మెసేజ్‌ను డిలీట్ చేయవచ్చు. దీంతో గ్రూప్ సభ్యులకు అడ్మిన్ తమ మెసేజ్‌ను డిలీట్ చేసినట్లు చాట్ స్క్రీన్‌పై కనిపించనుంది. ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉన్న ఈ ఫీచర్‌ను త్వరలోనే ఆండ్రాయిడ్, ఐవోఎస్ యూజర్లకు అందుబాటులో రానుంది.

మరోవైపు వాట్సాప్ ఎట్టకేల‌కు రియాక్షన్స్ ఫీచ‌ర్‌ను యూజ‌ర్లకు అందుబాటులోకి తేనుంది. తొలుత యూజ‌ర్లు రియాక్షన్ మెసేజ్ పంప‌డానికి ఆరు ఏమోజీలు పొందొచ్చు. లైక్‌, ల‌వ్‌, లాప్‌, స‌ర్‌ప్రైజ్‌, శాడ్‌, థ్యాంక్స్ ఎమోజీలు ఈ జాబితాలో ఉన్నాయి. అన్ని ర‌కాల ఏమోజీలు వాడే అవకాశం భ‌విష్యత్‌లో రావొచ్చు. వాటిలో కొన్ని బీటా టెస్టింగ్‌కు వినియోగిస్తున్నారు. దీనికి అద‌నంగా యాప్‌లోని జిఫ్‌లు, స్టిక్కర్లు కూడా యూజ‌ర్లు వినియోగించవచ్చు.

Central Bank of India: కేంద్రం కీలక నిర్ణయం.. మూతపడనున్న 600 బ్రాంచీలు

Exit mobile version