WhatsApp యూజర్లకు షాక్.. డబ్బులు కడితేనే వాట్సాప్ సేవలు..!
- WhatsApp ఉపయోగించడానికి డబ్బు చెల్లించాల్సిందే..
- ప్రకటన రహిత సబ్స్క్రిప్షన్ మోడల్‌ను పరీక్షిస్తున్న సంస్థ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
WhatsApp: స్మార్ట్ ఫోన్ ఉంటే.. వాట్సాప్ ఉండాల్సిందే.. అలసు ఈ యాప్ లేని ఫోన్ ఉంటుందా? అనే స్థాయిలోకి తీసుకెళ్లింది ఈ యాప్.. తక్కువ కాలంలోనే ఎన్నో మార్పులు.. మరెన్నో అప్డేట్లు.. మెసేజ్, వాయిస్ కాలింగ్, వీడియో కాలింగ్.. గ్రూప్ కాలింగ్.. ఇలా ఎప్పటికప్పుడు ఎన్నో కీలక ఫీచర్స్ అందుబాటులోకి వచ్చాయి.. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఉపయోగిస్తున్న ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (WhatsApp) త్వరలో పెయిడ్ సబ్స్క్రిప్షన్ మోడల్‌ను ప్రవేశపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వాట్సాప్ యూజర్లలో ఆందోళన నెలకొంది. రాబోయే రోజుల్లో వాట్సాప్ ఉపయోగించాలంటే వినియోగదారులు డబ్బులు చెల్లించాల్సి రావొచ్చన్న వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కంపెనీ తన ప్లాట్ఫామ్లో ప్రకటన రహిత (Ad-Free) సబ్స్క్రిప్షన్ మోడల్‌ను పరీక్షిస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి.
యాప్ కోడ్‌లో కొత్త సంకేతాలు
నివేదికల ప్రకారం, వాట్సాప్ తాజా వెర్షన్ 2.26.3.9 కోడ్‌ను పరిశీలించినప్పుడు స్టేటస్ (Status) మరియు ఛానెల్స్ (Channels) విభాగాల్లో ప్రకటనలను తొలగించేందుకు ప్రత్యేక సబ్స్క్రిప్షన్ మోడల్‌కు సంబంధించిన కొత్త స్ట్రింగ్‌లు గుర్తించారు. ఇది కంపెనీ భవిష్యత్తులో పెయిడ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టే ఆలోచనలో ఉందనే సంకేతంగా భావిస్తున్నారు. అయితే, ఈ విషయంపై ఇప్పటివరకు వాట్సాప్ లేదా మాతృసంస్థ మెటా (Meta) నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
Also Read
- Banks Merged: ఖాతాదారులకు బిగ్ అలర్ట్.. మరో రెండు బ్యాంకులు విలీనం..!
- Ethanol Car: పెట్రోల్‌తో పని లేదు.. 100 శాతం ఇథనాల్‌తో నడిచే కారు.. అక్టోబర్‌లోనే లాంచ్..
- Bank Strike: బ్యాంక్‌ల సమ్మె వేళ గుడ్ న్యూస్.. వాటికి ఛార్జీలు రద్దు.. SBI ఖాతాదారులకు భారీ ఊరట
- New Scheme: NPS పెన్షన్‌లో ఇప్పుడు ఆరోగ్య బీమా కూడా.. ఫ్యామిలీ మొత్తానికి వర్తింపు.. అక్టోబర్ 1 నుంచే అమల్లోకి..
ప్రకటనలపై గతంలోనూ పరీక్షలు
అయితే, గత సంవత్సరం కూడా వాట్సాప్ స్టేటస్ మరియు ఛానెల్స్ విభాగాల్లో ప్రకటనలను ప్రయోగాత్మకంగా ప్రారంభించింది. ఈ నిర్ణయం వినియోగదారుల నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంది. క్లిన్ యూజర్ ఇంటర్‌ఫేస్‌కి ప్రసిద్ధి చెందిన వాట్సాప్‌లో ప్రకటనలు రావడంపై పలువురు అసంతృప్తి వ్యక్తం చేశారు.
పెయిడ్ మోడల్‌పై ఇంకా స్పష్టత లేదు
వాట్సాప్ పెయిడ్ సబ్స్క్రిప్షన్ మోడల్‌కు సంబంధించిన సమాచారం ప్రస్తుతం పరిమితంగానే ఉంది. అయితే, కంపెనీ నిజంగా ఈ ప్లాన్‌ను అమలు చేయాలని నిర్ణయిస్తే, రాబోయే రోజుల్లో పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
వాట్సాప్ ప్రయాణం
వాట్సాప్‌ను 2009లో జాన్ కౌమ్ మరియు బ్రియాన్ ఆక్టన్ స్థాపించారు. 2010లో తక్షణ సందేశ సేవలు ప్రారంభించగా, 2011లో గ్రూప్ చాట్ ఫీచర్‌ను పరిచయం చేశారు. ఆండ్రాయిడ్, iOS ప్లాట్‌ఫార్మ్‌లపై విపరీతమైన ప్రజాదరణ పొందిన ఈ యాప్‌ను 2014లో ఫేస్బుక్ (ప్రస్తుతం మెటా) 19 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. ప్రస్తుతం ఈ యాప్ భారత్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా ఉపయోగించబడుతున్న మెసేజింగ్ యాప్‌గా కొనసాగుతోంది.
తాజావార్తలు
-
OTR: పశ్చిమ గోదావరిలో వైసీపీకి ఏం జరుగుతోంది?
-
Gyanesh Kumar: ‘‘నాకు బీజేపీ టికెట్ ఆఫర్ చేశారు’’.. జ్ఞానేష్ కుమార్‌పై మాజీ కేరళ సీఎస్ సంచలన ఆరోపణలు
-
AP I&PR Wins SKOCH Awards: జాతీయ స్థాయిలో ఏపీ ఐ & పీఆర్‌కు అరుదైన గౌరవం.. స్కోచ్ అవార్డులు
-
IND Vs WI: యశస్వి జైస్వాల్‌కు బ్యాడ్ న్యూస్.. రేపే వెస్టిండీస్‌తో మ్యాచ్.. జట్టులోని ఆటగాళ్లు వీరే..
-
Off The Record: రిజర్వేషన్ తేలకముందే జెడ్పీ రేస్!
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?