NTV Telugu Site icon

Tata: టాటా కంపెనీ సీఈఓల వార్షిక వేతనం ఎంతో తెలుసా..? షాక్ అవ్వడం ఖాయం..

Tata

Tata

Tata: దేశీయ పారిశ్రామిక దిగ్గజం టాటా ఇటీవల తన కంపెనీలోని వివిధ సంస్థల సీఈవోల జీతాలను 16-62 శాతం పెంచింది. సాధారణ టీసీఎస్ ఉద్యోగి ఏడాదికి లక్షల్లో వేతనం తీసుకుంటాడు. అలాంటిది టాటా గ్రూపులోని వివిధ కంపెనీల సీఈఓల జీతం ఎంత ఉంటుందనేది తెలుసుకోవాలని చాలా మందికి ఆసక్తి ఉంటుంది. అయితే ఇటీవల పెంచిన వేతనాలతో పలువురు టాటా సీఈఓలు కోట్లలో వేతనాలు తీసుకుంటున్నారు. టాటా గ్రూప్ మొత్తం 30 కంపెనీలను నిర్వహిస్తోంది.

ఒక నివేదిక ప్రకారం.. టాటా గ్రూపులోని ట్రెంట్ లిమిటెడ్ సీఈఓ పీ. వెంటేసలు ఈ ఏడాది రూ. 5.12 కోట్ల వేతనం అందుకోనున్నారు. ఇది 62 శాతం పెరుగుదలను సూచిస్తుంది. ఇక ఇండియన్ హోటల్స్ సీఈఓ పునీత్ ఛత్వాల్ వార్షిక వేతనం 37 శాతం పెరిగి రూ. 18.53 కోట్లకు చేరింది. టాటా కన్స్యూమర్ సీఈఓ సునీల్ డిసౌజా వేతనంగా 24 శాతం పెరిగి రూ. 9.5 కోట్లు అందుకోనున్నారు. వోల్టాస్ సీఈఓ ప్రదీప్ బక్షి వేతనం 22 శాతం పెరగడంతో రూ. 9.5 కోట్ల వార్షిక వేతనం తీసుకోనున్నారు.

Read Also: Dharmana Prasada Rao: పైసా రాలేదు.. చేతి చమురే వదులుతోంది..

టాటా కెమికల్స్ సీఈఓ ఆర్ ముకుందువాన్, టాటా పవర్ సీఈఓ ప్రవీర్ సిన్హాల వార్షిక వేతనం 16 శాతం పెరిగింది. వీరిద్దరు వరసగా రూ.8 కోట్లు, రూ. 9 కోట్లు వార్షిక వేతనంగా తీసుకోనున్నారు. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) మాజీ సీఈఓ అయిన రాజేష్ గోపీనాథన్ రూ. 29.31 కోట్ల రెమ్యునరేషన్ సంపాదించినట్లు నివేదిక పేర్కొంది.

1868లో జంషెడ్ జీ టాటా, టాటా గ్రూపును నెలకొల్పారు. ముంబై ప్రధాన కేంద్రంగా టాటా వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించింది. 6 ఖండాల్లో 100 కంటే ఎక్కువ దేశాల్లో టాటా వ్యాపారాన్ని నిర్వహిస్తోంది. 2021-22లో టాటా కంపెనీ మొత్తం ఆదాయం 128 బిలియన్ డాలర్లు, అంటే భారత కరెన్సీలో రూ. 9.6 ట్రిలియన్లుగా ఉంది. 30 టాటా గ్రూప్ సంస్థల్లో 9,35,000 మందికి పైగా పని చేస్తున్నారు.