Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Business News Vodafone Idea Share Price Surge Market Crash Kumar Mangalam Birla News

Vodafone – Idea: కుప్పకూలిన స్టాక్ మార్కెట్.. కానీ వొడాఫోన్ ఐడియా షేర్లకు రెక్కలు! షేర్ ధర ఎంత పెరిగిందంటే..

Published Date :May 11, 2026 , 5:14 pm
By Shiva Ganesh
Vodafone – Idea: కుప్పకూలిన స్టాక్ మార్కెట్.. కానీ వొడాఫోన్ ఐడియా షేర్లకు రెక్కలు! షేర్ ధర ఎంత పెరిగిందంటే..
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

Vodafone – Idea: ఈ రోజు స్టాక్ మార్కెట్ కుప్పకూలింది. పెరుగుతున్న ముడి చమురు ధరలు మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి, అయితే మార్కెట్‌లో ఈ రోజు ఒక స్టాక్ పెట్టుబడిదారుల దృష్టిని వేగంగా ఆకర్షించింది. ఇంకతీ ఆ స్టాక్ ఏంటో తెలుసా.. వోడాఫోన్ ఐడియా. సోమవారం నాడు, నిఫ్టీ – బ్యాంక్ నిఫ్టీ పడిపోతున్నప్పుడు, ఈ టెలికాం స్టాక్ ఏకంగా 10% పెరిగి రూ.12.37కు చేరుకుంది. మొత్తం మార్కెట్‌కు విరుద్ధంగా, ఈ స్టాక్ ఇంతగా దూసుకుపోవడానికి కారణం ఏమిటనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.

ఒకవైపు పెరుగుతున్న ముడి చమురు ధరలు, మరొక వైపు డాలర్‌తో పోలిస్తే బలహీనపడుతున్న రూపాయి కారణంగా స్టాక్ మార్కెట్ తీవ్రంగా దెబ్బతింది. నిఫ్టీ దాదాపు 250 పాయింట్లు పడిపోయి, 23,900 స్థాయికి సమీపంలో కదులుతోంది. బ్యాంక్ నిఫ్టీ 600 పాయింట్లకు పైగా పడిపోయింది. మార్కెట్ భయాలను కొలిచే ఇండియా విక్స్ (VIX) 9 శాతం పెరిగింది. ఇంత ప్రతికూల సమయంలో వొడాఫోన్ ఐడియా షేర్లు ఈ రోజు మార్కెట్‌లో లాభాలు నమోదు చేశాయి. గత శుక్రవారం రూ.11.25 వద్ద ముగిసిన ఈ స్టాక్, ఈరోజు రూ.11.22 వద్ద ప్రారంభమై, రూ.12.43కు చేరుకుంది. దీంతో కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.1,31,636 కోట్లకు చేరుకుంది.

Also Read

  • Warren Buffett: 'అమ్మా.. నీ కోపమే నన్ను ప్రపంచ విజేతను చేసింది'.. వారెన్ బఫెట్
  • Britannia Biscuit: బిస్కెట్ ప్రియులకు బ్యాడ్ న్యూస్.. పెరగనున్న బ్రిటానియా ధరలు, తగ్గనున్న బిస్కెట్లు!
  • PF Withdrawal: ATM నుండి PF డబ్బులు...! తాజా అప్‌డేట్‌ ఇదే..
  • Top Stocks: ఒక షేరు ధర రూ.1 లక్ష కంటే ఎక్కువ.. దేశంలోని 5 అత్యంత ఖరీదైన స్టాక్‌లు ఇవే!
Add as a preferred
source on google

బ్రిటన్ నుంచి బిగ్ న్యూస్ ..
నిజానికి ఈ రోజు మార్కెట్‌లో స్టాక్ పెరుగుదల వెనుక ఒక ప్రధాన వ్యూహాత్మక కారణం ఉందని సమాచారం. బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం.. వొడాఫోన్ గ్రూప్ పీఎల్‌సి తన భారతీయ విభాగాన్ని ఆర్థికంగా బలోపేతం చేయడానికి ప్రణాళిక రచిస్తోంది. బకాయి ఉన్న స్పెక్ట్రమ్ ఫీజుల విషయంలో భారత ప్రభుత్వం నుంచి ఉపశమనం పొందిన తర్వాత, ఈ కంపెనీ ఒక కొత్త స్టార్ట్ కోసం చూస్తోంది. ఇప్పుడు, వొడాఫోన్ పీఎల్‌సి తన బ్యాలెన్స్ షీట్‌ను పటిష్టం చేసుకోవడానికి ఒక కొత్త వ్యూహాన్ని చేపడుతోంది. నగదు పెట్టుబడి పెట్టడానికి బదులుగా, కంపెనీ షేర్ల బదిలీ నమూనాను పరిశీలిస్తోంది. ప్రస్తుతం వొడాఫోన్ పీఎల్‌సి, వొడాఫోన్ ఐడియాలో 19% వాటాను కలిగి ఉంది, దీని విలువ సుమారుగా రూ.23,160 కోట్లు. దీనిలో కొంత భాగాన్ని ట్రెజరీ స్టాక్‌గా భారతీయ కంపెనీకి బదిలీ చేయవచ్చని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

ఈ బదిలీ వల్ల కంపెనీకి లాభం ఏంటంటే.. వొడాఫోన్ ఐడియా (Vi) ఈ షేర్లను పొందినప్పుడు, వాటిని మార్కెట్లో అమ్మడం ద్వారా లేదా పెట్టుబడిదారులకు తాకట్టు పెట్టడం ద్వారా గణనీయమైన మొత్తంలో డబ్బును సమీకరించగలదని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఈ డబ్బును కంపెనీ మౌలిక సదుపాయాలు, నెట్‌వర్క్‌ను విస్తరించడానికి నేరుగా ఉపయోగిస్తారు. ఇది కంపెనీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తుందని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. వీటితో పాటు కంపెనీలో యాజమాన్య స్థాయిలో ఒక పెద్ద మార్పు కనిపించింది. మే 5వ తేదీన రవీందర్ టక్కర్ నాన్-ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ పదవికి రాజీనామా చేయగా, ఇప్పుడు ఆ బాధ్యతలను ప్రముఖ పారిశ్రామికవేత్త కుమార్ మంగలం బిర్లా స్వీకరించారు. ఈ రెండు ప్రధాన పరిణామాలు పెట్టుబడిదారుల విశ్వాసాన్ని పునరుద్ధరించాయి. నియంత్రణ సంస్థల మద్దతు, నిధుల సమీకరణపై ఉన్న అంచనాల ప్రత్యక్ష ఫలితమే ఈ పెరుగుదలకు కారణమని బోనాంజా రీసెర్చ్ విశ్లేషకురాలు ఖుషీ మిస్త్రీ కూడా అభిప్రాయపడ్డారు.

ఈ స్టాక్ ఇటీవలి పనితీరును చూస్తే, ఇది పెట్టుబడిదారులను నిరాశపరచలేదు. కేవలం గత వారంలోనే, ఈ స్టాక్ 16% పైగా రాబడిని ఇచ్చింది. ఒక నెల కాలంలో, ఇది దాదాపు 32% లాభపడింది. గత సంవత్సర కాలంలో ఇది సుమారు 84% ఆకట్టుకునే రాబడులను అందించినందున, దీర్ఘకాలిక పెట్టుబడిదారులకు ఇది ఒక మల్టీబ్యాగర్‌గా నిరూపించుకుంటోందని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Bank Nifty Crash
  • India VIX Rise
  • Kumar Mangalam Birla Vi Chairman
  • Market Crash India May 2026
  • Multibagger Stocks 2026

తాజావార్తలు

  • Vodafone – Idea: కుప్పకూలిన స్టాక్ మార్కెట్.. కానీ వొడాఫోన్ ఐడియా షేర్లకు రెక్కలు! షేర్ ధర ఎంత పెరిగిందంటే..

  • Bengal: సీఎం సువేందు తొలి కేబినెట్ భేటీ.. పలు కీలక నిర్ణయాలకు ఆమోదం

  • Crab Biryani Recipe : సీఫుడ్ ప్రియుల కోసం స్పెషల్ ‘పీతల బిర్యానీ’.. హోటల్ స్టైల్‌లో ఇంట్లోనే ఈజీగా చేసేయండి ఇలా.!

  • TMC Internal Crisis: దీదీ కోటలో చిచ్చు.. టీఎంసీలో సీనియర్ల తిరుగుబాటు! ఇక పార్టీ ముక్కలైనట్లేనా?

  • Petrol-Diesel: పెట్రోల్, డీజిల్ వినియోగం తగ్గించండి.. దేశ పౌరులకు కేంద్రం విజ్ఞప్తి

ట్రెండింగ్‌

  • 204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..

  • Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..

  • 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లే, యాక్టివ్ కూలింగ్‌తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!

  • PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..

  • Kathmandu: రన్‌వేపై మంటల్లో చిక్కుకున్న విమానం.. 278 మంది ప్రయాణికులు.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions