NTV Telugu Site icon

UPI Charges: UPI-రూపే చెల్లింపులు ఇకపై ఉచితం కాకపోవచ్చు.. ట్రాన్సాక్షన్స్ పై కొత్త ఛార్జీలు!

Upi

Upi

డిజిటల్ పేమెంట్స్ చెల్లింపుల స్వరూపాన్నే మార్చేశాయి. దాదాపు లావాదేవీలన్నీ ఆన్ లైన్ ద్వారానే చేస్తున్నారు. అయితే వినియోగదారులకు యూపీఐ చెల్లింపులపై బిగ్ షాక్ ఇవ్వబోతున్నట్లు సమాచారం. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) మరియు రూపే డెబిట్ కార్డ్ లావాదేవీలపై మర్చంట్ డిస్కౌంట్ రేటు (MDR)ను తిరిగి ప్రవేశపెట్టాలని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. డిజిటల్ చెల్లింపు పద్ధతులను ఉపయోగించే వ్యాపారులపై ఛార్జీలు విధించడానికి చర్చలు జరుగుతున్నాయని ఇద్దరు సీనియర్ బ్యాంకింగ్ అధికారులు తెలిపారు.

Also Read:IMD Warning: పలు రాష్ట్రాలకు అతి భారీ వర్ష సూచన

ప్రస్తుతం UPI, RuPay డెబిట్ కార్డ్ ట్రాన్సాక్షన్స్ MDR నుంచి మినహాయించబడ్డాయి. అయితే రూ. 40 లక్షల కంటే ఎక్కువ వార్షిక GST టర్నోవర్ ఉన్న వ్యాపారులకు MDR వర్తింపజేయాలని సూచిస్తూ బ్యాంకులు ఒక ప్రతిపాదనను తీసుకొచ్చాయి.పెద్ద వ్యాపారులు ఇప్పటికే వీసా, మాస్టర్ కార్డ్ డెబిట్ కార్డులు, వివిధ క్రెడిట్ కార్డులపై MDR చెల్లిస్తున్నారని బ్యాంకింగ్ అధికారులు చెబుతున్నారు. ఈ వ్యాపారులు UPI, RuPay లావాదేవీలకు కూడా ఛార్జ్ చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిసింది.

Also Read:Governor Jishnu Dev Varma : మా ప్రభుత్వం సామాజిక న్యాయం సంక్షేమానికి కట్టుబడి ఉంది

2022 కి ముందు బ్యాంకులు డిజిటల్ లావాదేవీలపై వ్యాపారుల నుంచి 1 శాతం కంటే తక్కువ MDR వసూలు చేసేవి. అయితే, నగదు రహిత చెల్లింపులను ప్రోత్సహించడానికి, ప్రభుత్వం FY22 బడ్జెట్‌లో ఈ ఛార్జీలను తొలగించింది. MDR పై ప్రభుత్వం తీసుకునే నిర్ణయం వ్యాపారులు, బ్యాంకులు, డిజిటల్ చెల్లింపు వినియోగదారులపై కూడా ప్రభావాన్ని చూపే ఛాన్స్ ఉందంటున్నారు నిపుణులు. కాగా ఫిబ్రవరి 2025లో UPI 1,611 కోట్ల లావాదేవీలను ప్రాసెస్ చేసింది. దీని విలువ రూ.21.96 లక్షల కోట్లు.