Site icon NTV Telugu

EPFO Update: పీఎఫ్‌ ఖాతాదారులకు బిగ్ అలర్ట్.. ఈ వివరాలు లేకపోతే క్లెయిమ్‌ రిజెక్ట్..!

Epfo

Epfo

మీకు ఈపీఎఫ్ అకౌంట్ ఉందా? ఈపీఎఫ్ అకౌంట్‌లో నామినీ వివరాలు అప్‌డేట్ చేసి ఉన్నాయా? లేదంటే ఇప్పుడు చేయండి. ఎందుకంటే పీఎఫ్ క్లెయిమ్ సమయంలో సమస్యలు రాకుండా ఉండాలంటే నామినీ పేరు తప్పనిసరి చేయాలని కేంద్రం ప్రభుత్వం ఆదేశాలు కూడా జారీ చేసింది. దీని వల్ల ఉద్యోగులు తమ ప్రయోజనాలు పొందడంతో పాటు ఉద్యోగుల భవిష్య నిధి (EPF) ఉద్యోగుల పెన్షన్ పథకం (EPS) లాంటివి బెనిఫిట్స్‌తో పాటు అనేక ఇతర ప్రయోజనాలపై ఆన్‌లైన్ క్లెయిమ్ సెటిల్‌మెంట్లు కూడా ఉంటాయి. అలాగే అకౌంట్ ఉపసంహరణ, నగదు విత్‌డ్రాకి ఈ నామినీ కంపల్‌సరీ చేసింది. సరైన నామినీ వివరాలు పొందుపర్చక పోతే విత్‌డ్రా దరఖాస్తును ఆటోమేటిక్‌గా రద్దు చేస్తామని ప్రకటించింది.

READ MORE: TG Inter Admissions: విద్యార్థులు అలర్ట్.. ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశాల గడువు చివరి అవకాశం!

ఆర్థిక పరమైన అంశాలు, సేవింగ్స్‌ సంబంధించినవి తమ తదనంతరం తమకు ప్రియమైన వారికి చెందాలని భావిస్తారు. అందుకోసం తమ పెట్టుబడులు, ఆస్తులకు సంబంధించిన వాటికి నామినీలను సూచిస్తుంటారు. అదే విధంగా బ్యాంక్ అకౌంట్‌, సేవింగ్స్ అకౌంట్‌ లేదా ఎంప్లాయీస్‌ ప్రావిడెంట్ ఫండ్ ఖాతా ఉన్న వారు సైతం ఇప్పుడు నామినీని యాడ్ చేయడం చాలా అవసరం. నామినేషన్ ఆన్‌లైన్‌లో లేదా ఆఫ్‌లైన్ ద్వారా మీ పీఎఫ్ అకౌంట్‌కి నామినీ యాడ్ చేయవచ్చు. దీని ద్వారా అకౌంట్‌ హోల్డర్‌, వారి కుటుంబ సభ్యులకు పలు రకాల ప్రయోజనాలను అందిస్తుంది. ప్రావిడెంట్ ఫండ్, పెన్షన్, ఇన్సూరెన్స్‌ బెనిఫిట్స్‌ ఆన్‌లైన్ క్లెయిమ్, సెటిల్‌మెంట్‌కు అవకాశం లభిస్తుంది. ముఖ్యంగా పీఎఫ్ అకౌంట్‌ హోల్డర్‌ మరణించిన సందర్భంలో ఈ సేవలు లబ్ధిచేకూరుస్తాయి. నామినీని అప్‌డేట్‌ చేయకుండా ఉద్యోగి మరణిస్తే, వారి వారసులు పీఎఫ్‌ ఫండ్స్‌ పొందేందుకు వారసత్వ ధృవీకరణ పత్రాన్ని పొందడానికి చట్టపరమైన ప్రక్రియను అనుసరించాల్సి ఉంటుంది.

READ MORE: Domestic Violence: మరీ ఇలా తయారయ్యారేంట్రా.. భీమిలిలో భర్తపై వేడినీళ్లు పోసిన భార్య!

Exit mobile version