Site icon NTV Telugu

Unemployment: మరింతపైకి నిరుద్యోగిత రేటు..

Unemployment

Unemployment

నిరుద్యోగిత రేటు మరింతపైకి కదిలింది.. సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమీ (సీఎంఐఈ) తాజాగా విడుదల చేసిన నివేదిక నిరుద్యోగిత పెరిగినట్టు స్పష్టం చేసింది.. ఈ ఏడాది మార్చిలో 7.60 శాతంగా ఉన్న నిరుద్యోగిత రేటు.. తర్వాత నెలలలో మరింత పైకి కదిలి.. ఏప్రిల్‌లో 7.83 శాతంగా నమోదైంది. అయితే, పట్టణ, గ్రామీణ ప్రాంతాలను పరిశీలిస్తే మాత్రం భిన్నంగా ఉంది.. పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగిత రేటు మార్చి నెలలో 8.28 శాతం ఉంటే.. ఏప్రిల్‌ నెలలో అది 9.22 శాతానికి పెరిగింది. ఇదే సమయంలో గ్రామీణ ప్రాంతాల్లో కాస్త తగ్గింది. అంటే, మార్చిలో గ్రామీణ నిరుద్యోగిత రేటు 7.29 శాతం ఉంటే.. ఏప్రిల్‌లో 7.18 శాతానికి తగ్గిపోయింది.

Read Also: Covid: చైనాలో దారుణ పరిస్థితులు..! నెగిటివ్‌ వచ్చినా క్వారెంటైన్‌కే..!

ఈ జాబితాలో 34.5 శాతంతో హర్యానా మొదటి స్థానంలో నిలిచింది.. ఈ సమయంలో నిరుద్యోగిత రేటు పెరగడానికి దేశీయ డిమాండ్‌ మందగించడం, ధరల పెరుగుదల మధ్య ఆర్థిక రికవరీ నెమ్మదిగా ఉండడమే కారణంగా విశ్లేషిస్తున్నారు ఆర్థిక నిపుణులు. మరోవైపు, రిటైల్‌ ద్రవ్యోల్బణం మార్చిలో 6.95 శాతానికి అంటే 17 నెలల గరిష్టానికి దూసుకెళ్లగా.. ఈ ఏడాది చివరి నాటికి 7.5 శాతానికి చేరుకునే అవకాశముందని అంచనా వేస్తున్నారు.

Exit mobile version