NTV Telugu Site icon

UDAN Scheme: ఉడాన్‌ పథకం ఘనత. ఐదేళ్లలో లక్షన్నరకు పైగా విమానాలు ప్రారంభం.

Udan Scheme

Udan Scheme

UDAN Scheme: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న ఉడాన్‌ పథకంలో భాగంగా గత ఐదేళ్లలో లక్షన్నరకు పైగా విమానాలను ప్రారంభించామని విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా చెప్పారు. విమానయాన పరిశ్రమను ప్రజాస్వామ్యీకరించామని అన్నారు. రానున్న నాలుగేళ్లలో 40 కోట్ల మంది విమాన ప్రయాణాలు చేస్తారని అంచనా వేస్తున్నట్లు పేర్కొన్నారు.

30 వేల కోట్లు

దేశంలోని అతిపెద్ద రిటైలర్‌ అయిన రిలయెన్స్‌ ఈ ఆర్థిక సంవత్సరంలో రిటైల్‌ రంగంలో దాదాపు 30 వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టినట్లు వార్షిక నివేదికలో వెల్లడించింది. ఈ నిధులను సేంద్రియ వృద్ధి, ఆస్తుల కొనుగోళ్లు, వ్యూహాత్మక భాగస్వామ్యాలు తదితర విభాగాల్లో ఖర్చుపెట్టామని తెలిపింది. కొత్తగా 2 వేల 500 స్టోర్లతోపాటు కోటికి పైగా విస్తీర్ణం గల గిడ్డంగి స్థలాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు పేర్కొంది.

Telangana Governament: తెలంగాణలో పనిచేయని పలు ప్రభుత్వ వెబ్‌సైట్లు. అవేంటంటే?

‘దేశ్‌’పై ఆందోళన

ప్రత్యేక ఆర్థిక మండళ్ల చట్టం స్థానంలో కేంద్ర ప్రభుత్వం దేశ్‌ అనే పేరుతో కొత్త చట్టాన్ని తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. దీనికోసం రూపొందించిన బిల్లులో కొన్ని ప్రత్యక్ష పన్నుల మినహాయింపులు ఇవ్వాలని ప్రతిపాదించటంపై కేంద్ర రెవెన్యూ విభాగం ఆందోళన వ్యక్తం చేసిందని సమాచారం. కొన్ని కంపెనీలకే పన్ను మినహాయింపులిస్తే మిగతా సంస్థలు కూడా డిమాండ్‌ చేసే అవకాశం ఉందని చెప్పిట్లు తెలుస్తోంది.

‘ఖర్చుల’పై దృష్టి

ఖర్చులను సమర్థంగా నిర్వహించటంపై స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా దృష్టిపెట్టింది. ఆపరేషన్స్‌ సపోర్ట్‌ సర్వీసెస్‌ పేరుతో అనుబంధ సంస్థను త్వరలో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా అనుమతించింది. ఈ కొత్త విభాగం ముఖ్యంగా మానవ వనరులకు సంబంధించిన వివిధ అంశాలపై ఫోకస్‌ పెట్టనుంది.

అరుదైన సందర్భం

మన దేశ స్టాక్‌ మార్కెట్‌లో అరుదైన మరియు ఆసక్తికరమైన సందర్భం చోటుచేసుకుంది. మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌-టు-గ్రాస్‌ డొమెస్టిక్‌ ప్రొడక్ట్‌ నిష్పత్తి మరోసారి 100 శాతం మార్క్‌కు చేరింది. గతంలో 2008-09 మరియు 2019-20 సంవత్సరాల్లో కూడా ఈ గణాంకాలు నమోదుకావటం విశేషం. 2008లో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం నెలకొనటానికి ముందు ఎంక్యాప్‌-టు-జీడీపీ రేషియో దాదాపు 150 శాతానికి వెళ్లింది.

చైనా ఫీట్‌

చైనా స్టాక్‌ మార్కెట్‌లో గతంలో ఎన్నడూలేనంత బూమ్‌ నెలకొంది. ఈ ఏడాది ఇప్పటికే రికార్డ్‌ స్థాయి వృద్ధిని సాధించింది. వివిధ సంస్థలు ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫరింగ్స్‌ ద్వారా 57 పాయింట్‌ 8 బిలియన్‌ డాలర్ల నిధులను సేకరించాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో షేర్ల కొనుగోళ్లు అడుగంటుతున్న నేపథ్యంలో చైనాలో ఈ స్థాయిలో సేల్స్‌ జరగటం అన్ని దేశాలను ఆశ్చర్యపరుస్తోంది.

స్టాక్‌ మార్కెట్‌ అప్‌డేట్‌

స్టాక్‌ మార్కెట్లు ఇవాళ ఓ మోస్తరు లాభాలతో ప్రారంభమయ్యాయి. ఇంట్రాడేలో క్రమంగా పుంజుకుంటున్నాయి. సెన్సెక్స్‌ 282 పాయింట్లు, నిఫ్టీ 77 పాయింట్లు పెరిగింది. టాటా స్టీల్‌, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబొరేటరీస్‌, హెచ్‌డీఎఫ్‌సీ, ఎన్టీపీసీ, ఎల్‌&టీలు లాభాల్లో కొనసాగుతున్నాయి. హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ షేర్ల విలువ 5 శాతం పెరిగింది. బలమైన వ్యాపార దృక్పథంతో సరికొత్త గరిష్టానికి చేరింది. ఎస్‌బీఐ, నెస్లే, టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌, ఐసీఐసీఐ నష్టాల్లో నడుస్తున్నాయి. రూపాయి మారకం విలువ 1.29 పైసలు పతనమై 79.12 వద్ద ఉంది.

Show comments