క్యాబ్ సర్వీసులు అందుబాటులోకి వచ్చాక.. వేగంగా గమ్యస్థానాలకు చేరేందుకు ప్రయాణికులు క్యాబ్‌లనే బుక్ చేసుకుంటున్నారు. అయితే కొన్ని సార్లు ఆలస్యం కావడంతో ముందుగా బుక్ చేసుకున్న రిజర్వేషన్లు కోల్పోతున్నారు. దీంతో వేల రూపాయుల డబ్బులు కోల్పోవల్సి వస్తుంది. ఎయిర్‌పోర్టుకు బుక్ చేసుకున్న క్యాబ్ సమయానికి రాలేదని ఓ ప్రయాణికుడు జిల్లా కమిషన్‌ను ఆశ్రయించాడు. దీంతో ఉబర్ సంస్థకు న్యాయస్థానం షాకిచ్చింది. రూ.54,000 జరిమానా చెల్లించాలని ఆదేశించింది.
ఇది కూడా చదవండి: Hyundai Motor: హ్యుందాయ్ లవర్స్కి షాక్.. జనవరి 1 నుంచి రూ. 25000 వేలు పెంపు..
ఢిల్లీకి చెందిన ఓ జంట.. ఉబర్ క్యాబ్ ఆలస్యం కారణంగా ఇండోర్‌కు వెళ్లే విమానాన్ని కోల్పోయారు. దీంతో వారు జిల్లా కమిషన్‌ను ఆశ్రయించారు. 2022లో తెల్లవారుజమున 3:15కి ఉపేంద్ర సింగ్ క్యాబ్ బుక్ చేశారు. కానీ సమయానికి క్యాబ్ రాకపోవడంతో విమాన ప్రయాణం కోల్పోవల్సి వచ్చిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఉబర్ సంస్థకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని వాపోయారు. అక్టోబరు 2023లో పరిహారంగా రూ.24,100, మానసిక క్షోభ, న్యాయపరమైన ఖర్చులకు అదనపు జరిమానాగా రూ. 30,000 చెల్లించాలని కంపెనీకి జిల్లా కమీషన్ ఆదేశించింది. తాజాగా జిల్లా కమిషన్ తీర్పును ఢిల్లీ రాష్ట్ర వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ సమర్థించింది. ఢిల్లీ వ్యక్తికి నష్ట పరిహారం చెల్లించాలని ఆదేశించింది.
ఇది కూడా చదవండి: Pushpa 2: ‘పుష్ప 2’ డే 1 కలెక్షన్స్.. బాహుబలి, RRR ఔట్?
క్యాబ్ ఆలస్యం కారణంగా ఉపేంద్ర సింగ్, అతని భార్య స్థానిక టాక్సీని అద్దెకు తీసుకొని ఉదయం 5:15 గంటలకు విమానాశ్రయానికి చేరుకున్నారు. కానీ అప్పటికే ఇండోర్ వెళ్లే విమానాన్ని మిస్ అయ్యారు. దీంతో ఉబర్ సంస్థకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. దీంతో విసుగుపోయిన ఆ జంట లీగల్ నోటీసు పంపించింది. కానీ ఎలాంటి స్పందన రాలేదు. దీంతో ఆ జంట జిల్లా కమిషన్ ఆశ్రయించారు. మొత్తానికి ఉబర్ నిర్లక్ష్యానికి భారీ జరిమానా విధించింది.
ఇది కూడా చదవండి: Minister Konda Surekha: మహిళ సంఘాలకు గుడ్‌న్యూస్.. వడ్డీ లేని రుణాలు అందిస్తామన్న మంత్రి