Site icon NTV Telugu

Trump Tariffs: రష్యా నుంచి చమురు దిగుమతులను భారత్ ఆపేస్తే.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకే ముప్పు..!

Trump Tariffs

Trump Tariffs

Trump Tariffs: రష్యా నుంచి చమురు కొనుగోళ్లు చేస్తోన్న దేశాలపై అగ్గిమీద గుగ్గిలం అవుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌.. టారిఫ్‌ బాంబులను ప్రకటించిన సంగతి తెలిసిందే. మాస్కోతో చమురు వాణిజ్యం చేస్తే భారత్‌ సహా ఆయా దేశాలపై 100శాతం సుంకాలు విధిస్తానని హెచ్చరించారు. అయితే.. నిన్న భారత్‌పై 50% శాతం అదనపు టారిఫ్‌ విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అసలు.. భారత్ రష్యన్ చమురు కొనుగోలును ఆపివేస్తే ఏం జరుగుతుంది? ఈ ప్రశ్నకు సమాధానం బహుశా ట్రంప్ ఊహించలేదు కావొచ్చు. రష్యన్ చమురును భారత్ కొనుగోలు చేస్తుంది కాబట్టే.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ స్థిరంగా ఉందని నిపుణులు చెబుతున్నారు.

READ MORE: Spirit : స్పిరిట్ లో ప్రభాస్ తో నటించే ఛాన్స్.. ఇలా అప్లై చేయండి

రష్యా చమురు మార్కెట్ల నుంచి భారత్ అకస్మాత్తుగా వైదొలగడం వల్ల ప్రపంచ స్థాయిలో ముడి చమురు ధరలు బ్యారెల్‌కు $200 కంటే ఎక్కువగా పెరిగే అవకాశం ఉందని ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇది భారతదేశానికి మాత్రమే కాకుండా ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కూడా పెద్ద ముప్పుగా మారుతుందని చెబుతున్నారు. భారత్ రష్యన్ చమురు కొనుగోలు చేయడం వల్ల ధరలు స్థిరంగా ఉన్నాయని.. ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం ముప్పు నివారించబడిందని స్పష్టం చేస్తున్నారు.

READ MORE: KTR: రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీతో దోస్తీ డ్రామా.. మోడీతో కుస్తీ డ్రామా

రష్యన్ చమురు కొనుగోలు చేయడం ద్వారా భారత్ ప్రపంచ మార్కెట్లకు స్థిరత్వాన్ని తెచ్చిపెట్టిందనే వాదనను అమెరికా అధికారులు గతంలో అంగీకరించారు. భారత్ చమురు కొనుగోలును కొనసాగిస్తుండటంతో సంతోషంగా ఉన్నామని అమెరికా ఆర్థిక మంత్రి (నవంబర్ 2022) తన ప్రకటనలో తెలిపారు. మాజీ అధ్యక్షుడు బైడెన్ ప్రభుత్వంలో ఇంధన సలహాదారు (2024) సైతం భారత్ ప్రపంచ మార్కెట్లను స్థిరీకరించడంలో సహాయపడిందని స్పష్టం చేశారు. అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి (మే 2024) సైతం ఈ అంశంపై గతంలో భారత్‌ను మెచ్చుకున్నారు. ఈ ప్రకటనల ద్వారా భారత్‌ సొంత లాభం కోసం చమురును కొనుగోలు చేయడం లేదని స్పష్టమవుతోంది. ఈ అంశాన్ని ముఖ్యంగా అధ్యక్షుడు ట్రంప్ గుర్తించాల్సి ఉంది.

Exit mobile version