NTV Telugu Site icon

Pranava Greenwich: హైదరాబాద్‌లో గ్రీన్ మోడల్‌ విల్లాస్‌.. పచ్చదనంతో పాటు ప్రశాంతత వెల్లువిరిసేలా..

Greenwich

Greenwich

Pranava Greenwich: సొంతిల్లు ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. అదే కాకుండా మరి ఆ ఇల్లు ఎలా ఉండాలి? కేవలం విశాలంగా మాత్రమే ఉంటే సరిపోదు కదా?.. పచ్చని చెట్లతో చల్లటి గాలి వీస్తూ, చక్కటి సూర్మరశ్మితో ఆహ్లాదకరమైన వాతావరణం తొణికిసలాడే విధంగా ఉండాలి. అలాంటి గ్రీన్‌ బిల్డింగ్స్‌ను ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ఇప్పుడు ఎక్కువగా గ్రీన్‌ బిల్డింగ్స్ మీద ఆసక్తి చూపుతున్నారు నగరవాసులు. అలా ఎకోఫ్రెండ్లీ నిర్మాణంలో జీవనాన్ని కొనసాగించాలని కోరుకుంటున్నారా?.. హైదరాబాద్‌లో ఇదెలా సాధ్యవమవుతుందని ఆలోచిస్తున్నారా? అలాంటి గ్రీన్‌ బిల్డింగ్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది మీ ప్రణవ గ్రూప్‌కు చెందిన గ్రీన్‌విచ్. హైదరాబాద్‌లో అతిపెద్ద రియల్ సంస్థల్లో ప్రణవ గ్రూప్ ఒకటి. ఈ సంస్థ కమర్షియల్, రెసిడెన్షియల్ ప్రాజెక్టులను గ్రీన్ మోడల్‌లో నిర్మిస్తూ ఆదర్శంగా నిలుస్తోంది. గ్రీన్‌ సర్టిఫికేషన్‌ ఉండేలా భవనాలను నిర్మిస్తోంది గ్రీన్‌విచ్‌ సంస్థ.

ప్రకృతి ఒడిలో మోడరన్ విల్లాస్..
విశాలమైన విస్తీర్ణంలో పెద్ద విల్లాలో నివసిస్తూ.. స్విమ్మింగ్‌ ఫూల్, మోడరన్ జిమ్ మరెన్నో సౌకర్యాలతో ప్రకృతిని ఆస్వాదిస్తూ ఆనందంగా జీవించాలని చాలా మంది కోరుకుంటారు. కానీ ప్రకృతి పచ్చదనం కోసం చాలా దూరం వెళ్తే తప్ప సాధ్యం కాదని భావిస్తుంటారు. ఇందుకోసం ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇంట్లోకి స్వచ్ఛమైన గాలి, వెలుతురు వచ్చేలా పర్యావరణ అనుకూల భవనాలను గ్రీన్‌విచ్ నిర్మించింది. అత్తాపూర్‌లో ఒక మహత్తరమైన ప్రీమియం విల్లా కమ్యూనిటీని ప్రణవ గ్రూప్ గ్రీన్‌విచ్‌ విల్లాస్ అనే పేరుతో అద్భుతంగా నిర్మించింది. పచ్చదనంతో పాటు ప్రశాంతత వెల్లువిరిసేలా ఈ విల్లా కమ్యూనిటీని నిర్మించింది.

గ్రీన్‌ విచ్‌ విల్లాస్‌ ప్రత్యేకతలు..
ప్రణవ గ్రూప్‌ ఏ ప్రాజెక్టు ప్రారంభించినా తమ ప్రత్యేకతను చాటుకోవడంతో పాటు సకల సౌకర్యాలను కల్పిస్తుంది. గ్రీన్‌విచ్‌ విల్లా ప్రాజెక్టు డిజైన్ చూస్తే ఆ విషయం ఇట్టే అర్థమైపోతుంది. దాదాపు 9.13 ఎకరాల్లో 90 విల్లాలను ఈస్ట్, నార్త్, వెస్ట్ ఫేసింగ్‌లో తీర్చిదిద్దింది. గ్రీన్‌ విచ్‌ విల్లాస్‌లో అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ ప్రాజెక్టులో ప్రత్యేకంగా హెర్బల్ గార్డెన్, వెజిటేబుల్స్ గార్డెన్ వంటివి తీర్చిదిద్దారు. పచ్చని చెట్ల మధ్య మెడిటేషన్ ఏరియా, సీనియ‌ర్ సిటిజెన్స్ డెక్‌, రిఫ్లెక్సాల‌జీ పాత్‌వే వంటి వాటికి స్థానం క‌ల్పించారు. యాంఫీ థియేట‌ర్‌, ఔట్‌డోర్ ప్లే ఏరియా, క్రికెట్ ప్రాక్టీసింగ్ నెట్‌, హాఫ్ బాస్కెట్ బాల్ కోర్టు, సైకిల్ ట్రాక్, స్కేటింగ్ రింక్‌, అవుట్‌ డోర్‌ ఫిట్‌నెస్ జోన్‌ వంటి వాటికి పెద్దపీట వేశారు. వీటితో మరెన్నో సౌకర్యాలను కల్పించారు. 15 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో క్లబ్‌హౌస్‌ను ఏర్పాటు చేశారు. ఈ క్లబ్ హౌజ్‌లో పూల్ డెక్‌, లాప్ పూల్‌, కిడ్స్ పూల్‌తో ఆధునిక సదుపాయాలకు కొదువ లేకుండా నిర్మించారు.

అన్ని చేరువలోనే..
అత్యాధునిక ప్రమాణాలకు లోటు లేకుండా నిర్మించిన ప్రణవ గ్రూప్‌కు చెందిన గ్రీన్‌ విచ్‌ విల్లాస్‌కు అత్తాపూర్‌ మెయిన్ రోడ్డు నుంచి ఒక్క నిమిషంలో చేరుకోవచ్చు. ఆస్పత్రులు, మాల్స్, స్కూల్స్, కాలేజీలు, వినోద సౌకర్యాలతో పాటు ప్రతి ఒక్కటి ఈ ప్రాజెక్టుకు అందుబాటులో ఉంది. హైటెక్ సిటీకి మ‌హా అయితే 15 నిమిషాలు, ఎయిర్‌పోర్టుకు 20 నిమిషాల్లో చేరుకోవ‌చ్చు.