Gold and Silver Prices Today: పసిడి ప్రియులకు చుక్కలే.. భారీగా పెరిగిన గోల్డ్, సిల్వర్ ధరలు

  • భారీగా పెరిగిన గోల్డ్, సిల్వర్ ధరలు
  • తులం పసిడి ధర రూ. 2450 పెరిగింది
  • కిలో సిల్వర్ పై రూ. 10,000 పెరిగింది.
Gold

Gold

దేశీయ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు మరోసారి భారీ మార్పులను నమోదు చేశాయి. అంతర్జాతీయ పరిణామాలు, ముఖ్యంగా అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పందానికి సంబంధించిన వార్తల ప్రభావంతో విలువైన లోహాల ధరల్లో ఒడిదుడుకులు కనిపిస్తున్నాయి. సోమవారం (జూన్ 15) ట్రేడింగ్‌లో బంగారం, వెండి ధరలు గణనీయంగా పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో తులం పసిడి ధర రూ. 2450 పెరిగింది. కిలో సిల్వర్ పై రూ. 10,000 పెరిగింది.

హైదరాబాద్‌లో నేటి బంగారం ధరలు.. 24 క్యారెట్ల బంగారం (99.9% స్వచ్ఛత) గ్రాముకు రూ.15,153, 22 క్యారెట్ల బంగారం (91.6% స్వచ్ఛత) గ్రాముకు రూ.13,890, 18 క్యారెట్ల బంగారం (75% స్వచ్ఛత) గ్రాముకు రూ.11,365 వద్ద ట్రేడ్ అవుతోంది.

×
×
Ad

తులం గోల్డ్ ధర రూ.2450 పెరిగింది

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ. 2450 పెరిగి రూ.1,51,530 దగ్గర ట్రేడ్ అవుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 2250 పెరగడంతో రూ.1,38,900 కి చేరింది. ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి ధర1,51,680 వద్ద, 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర 1,39,050 వద్ద సేల్ అవుతోంది.

సిల్వర్ ధర

హైదరాబాద్ లో కిలో వెండి రూ. 2,80,000 వద్ద సేల్ అవుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో కిలో సిల్వర్ ధర రూ. 2,65,000 వద్ద ట్రేడ్ అవుతోంది.