పసిడి ప్రియులకు షాకింగ్ న్యూస్ ఈరోజు బంగారం ధరలు పరుగులు పెడుతున్నాయి.. నిన్న కాస్త పెరిగిన బంగారం ధరలు నేడు మార్కెట్ లో షాక్ ఇస్తున్నాయి.. గత కొన్ని రోజులుగా పసిడి ధరలు పరుగులు పెడుతున్నాయి.. ధరలు ఆకాశాన్ని తాకుతున్నా మార్కెట్ లో డిమాండ్ తగ్గలేదు పండగ సీజన్ కాబట్టి కొనుగోళ్లు ఎక్కువగానే ఉన్నాయి.. ప్రస్తుతం దేశీయంగా 22 క్యారెట్ల తులం బంగారంపై 700 రూపాయల వరకు పెరిగింది. అలాగే 24 క్యారెట్ల తులం బంగారంపై 770 రూపాయల వరకు పెరిగింది.. ఇది షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి.. ఈరోజు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయి చూద్దాం..
*. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,600 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,750 ఉంది.
*. అలాగే ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు 56,400 రూపాయలు ఉండగా, అదే 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 61,530 వద్ద కొనసాగుతుంది.
*. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,550 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,690 వద్ద ఉంది.
*. కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,400 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 61,530 రూపాయలు వద్ద ఉంది.
*. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 56,400 రూపాయలు ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,530 ఉంది..
మిగిలిన అన్ని నగరాల్లో బంగారం ధరలు అలానే కొనసాగుతున్నాయి.. ఈరోజు స్వల్పంగా పెరిగినా కూడా కొనుగోళ్లు ఆపలేదు.. ఇక వెండి ధర మాత్రం ఈరోజు మార్కెట్ లో స్థిరంగా ఉంది.. దేశంలో వెండి ధరను చూస్తే ప్రస్తుతం స్థిరంగా ఉంది. కిలో వెండి ధర రూ.74,600 వద్ద కొనసాగుతోంది.. ఇతర వస్తువుల మాదిరిగానే డిమాండ్, సరఫరా బంగారం ధరపై పెద్ద ప్రభావాన్ని చూపుతాయి. తక్కువ సరఫరా, ఎక్కువ డిమాండ్ ఉన్నప్పుడు ధర పెరుగుతుంది.. మరి మార్కెట్ లో రేపటి ధరలు ఉంటాయో చూడాలి..