Today Stock Market Roundup 29-03-23: దేశీయ స్టాక్ మార్కెట్ ఇవాళ బుధవారం పర్వాలేదనిపించింది. రెండు కీలక సూచీలు కూడా చెప్పుకోదగ్గ పనితీరు కనబరిచాయి. అన్ని రంగాల కంపెనీల షేర్లు లాభాల బాట పట్టాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైన సెన్సెక్స్, నిఫ్టీ.. సాయంత్రం కూడా లాభాలతోనే ముగిశాయి. సెన్సెక్స్.. 346 పాయింట్లు పెరిగి 57 వేల 960 పాయింట్ల వద్ద ఎండ్ అయింది.
నిఫ్టీ.. 129 పాయింట్లు పెరిగి 17 వేల 80 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్‌లోని మొత్తం 30 కంపెనీల్లో 26 కంపెనీలు రాణించాయి. మిగతా నాలుగు కంపెనీలు మాత్రమే వెనకబడ్డాయి. సెన్సెక్స్‌లో హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, టాటా మోటార్స్ షేర్ల విలువ పెరగ్గా.. రిలయెన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ మరియు ఎయిర్‌టెల్ పడిపోయాయి. నిఫ్టీలో అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ పోర్ట్స్ స్టాక్స్ వ్యాల్యూ పెరగ్గా.. యూపీఎల్, ఎయిర్‌టెల్ నేలచూపులు చూశాయి.
read more: AI Software New Version: AI సాఫ్ట్‌వేర్ కొత్త వెర్షన్. రీసెంట్‌గా రిలీజ్ చేసిన ఓపెన్ ఏఐ
వ్యక్తిగత షేర్ల విషయానికొస్తే.. జీ ఎంటర్‌టైన్‌మెంట్ 3 శాతానికి పైగా అడ్వాన్స్ అయింది. ఇండస్ ఇండ్ బ్యాంక్‌తో వివాదాన్ని పరిష్కరించుకోవటం కలిసొచ్చింది. 10 గ్రాముల బంగారం ధర 73 రూపాయలు తగ్గింది. గరిష్టంగా 58 వేల 969 రూపాయల వద్ద ట్రేడ్ అయింది. కేజీ వెండి రేటు స్వల్పంగా 46 రూపాయలు పెరిగింది. అత్యధికంగా 70 వేల 630 రూపాయలు పలికింది.
క్రూడాయిల్ ధర కూడా స్వల్పంగా 44 రూపాయలు పెరిగింది. ఒక బ్యారెల్ ముడిచమురు 6 వేల 100 రూపాయలుగా నమోదైంది. రూపాయి వ్యాల్యూ 10 పైసలు బలహీనపడింది. డాలరుతో పోల్చితే మారకం విలువ 82 రూపాయల 31 పైసల వద్ద స్థిరపడింది.