Site icon NTV Telugu

Stock Market: బీఎంసీ ఎగ్జిట్ ఫలితాలు ఎఫెక్ట్.. భారీ లాభాల్లో సూచీలు

Stockmarket

Stockmarket

దేశీయ స్టాక్ మార్కెట్‌కు సరికొత్త జోష్ వచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా మిశ్రమ సంకేతాలు ఉన్నప్పటికీ.. ఆర్థిక రాజధాని ముంబై మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ కూటమి జయకేతనం ఎగరేస్తుందన్న ఎగ్జిట్ పోల్స్ అంచనాలతో మార్కెట్ భారీ లాభాలతో ప్రారంభమైంది. ప్రస్తుతం అన్ని సూచీలు గ్రీన్‌లో కొనసాగుతున్నాయి. ఎగ్జిట్ ఫలితాలు ఇన్వెస్టర్లకు ఊపునిచ్చినట్లుగా కనిపిస్తోంది. ప్రస్తుతం సెన్సెక్స్ 269 పాయింట్లు లాభపడి 83,652 దగ్గర కొనసాగుతుండగా.. నిఫ్టీ 65 పాయింట్లు లాభపడి 25,730 దగ్గర కొనసాగుతోంది.

ఇది కూడా చదవండి: US-Iran: వెనక్కి తగ్గిన అమెరికా.. తెరుచుకున్న ఇరాన్ గగనతలం

నిఫ్టీలో ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, శ్రీరామ్ ఫైనాన్స్, ఎం అండ్ ఎం, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ, హెచ్‌డీబీ ఫైనాన్షియల్ సర్వీసెస్, నువోకో విస్టాస్ కార్పొరేషన్, ఏంజెల్ వన్, 360 వన్ వామ్, సౌత్ ఇండియన్ బ్యాంక్, స్వరాజ్ ఇంజిన్స్, వారీ రెన్యూవబుల్ టెక్నాలజీస్, బయోకాన్, రైల్‌టెల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వంటి స్టాక్‌లు ప్రధాన లాభాలను ఆర్జించగా.. సిప్లా, హెచ్‌డిఎఫ్‌సి లైఫ్, ఒఎన్‌జిసి, అపోలో హాస్పిటల్స్, భారతి ఎయిర్‌టెల్ నష్టపోయాయి.

ఇది కూడా చదవండి: BMC Result: నేడు ముంబై మున్సిపల్ ఫలితాలు.. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఇవే!

Exit mobile version