Site icon NTV Telugu

గుడ్‌ న్యూస్‌ : భారీగా తగ్గిన బంగారం ధరలు

gold

మన దేశంలో బంగారానికి డిమాండ్ ఎప్పుడూ ఉంటుంది. అయితే మొన్నటి వరకు బంగారం ధరలు భారీగా పెరిగిపోయాయి. అయితే… గ‌త కొన్ని రోజులుగా పెరుగుతూ, కొద్దిగా తగ్గుతూ వ‌చ్చిన బంగారం ధ‌ర‌ల్లో ఈరోజు భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. నేడు బంగారం ధరలు తగ్గాయి. హైద‌రాబాద్ బులియ‌న్ మార్కెట్లో ధ‌ర‌లు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధ‌ర రూ. 110 తగ్గి రూ. 44,400 కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధ‌ర రూ. 120 తగ్గి రూ. 48, 440 కి చేరింది. దేశీయంగా మార్కెట్లు తిరిగి క్రమంగా పుంజుకోవ‌డంతో బంగారం ధ‌ర‌లు తగ్గుముఖం ప‌డుతున్నాయి. అటు అంత‌ర్జాతీయంగా కూడా బంగారం ధ‌ర‌లు కొంత‌మేర తగ్గడంతో ఆ ప్రభావం దేశీయ మార్కెట్ల‌పై ప‌డింది. ఇక బంగారం ధ‌ర‌లతో పాటుగా వెండి ధ‌ర‌లు కూడా తగ్గాయి. కిలో వెండి ధ‌ర రూ. 200 తగ్గి రూ. 69,600 వ‌ద్ద కొనసాగుతోంది.

Exit mobile version