NTV Telugu Site icon

Gold Rates: తగ్గేదే లే అంటున్న బంగారం ధరలు.. తులంపై రూ. 1040 పెరిగిన గోల్డ్ ధర

Gold

Gold

బంగారం ధరలు గోల్డ్ ప్రియులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఆభరణాలు కొందామన్నా, ఇన్వెస్ట్ చేద్దామన్నా ఆలోచించాల్సిన పరిస్థితి తలెత్తింది. అంతకంతకు పెరుగుతూ సామాన్యులకు అందని ద్రాక్షలా మారింది పసిడి. బంగారం కొనాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందేనా అంటూ ఉసూరుమంటున్నారు. కాగా పుత్తడి ధరలు నేడు మరోసారి ఆకాశాన్ని తాకాయి. నిన్న తులం బంగారంపై ఏకంగా రూ. 1050 పెరగగా.. నేడు మళ్లీ రూ. 1040 పెరిగింది. తగ్గేదే లే అంటూ బంగారం ధరలు భగభగమంటున్నాయి. నేడు హైదరాబాద్ లో తులం గోల్డ్ ధర ఎంతుందో ఇప్పుడు చూద్దాం.

హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ. 7,905గా, 24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ. 8,624 వద్ద ట్రేడ్ అవుతోంది. కాగా నేడు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 950 పెరిగింది. దీంతో తులం గోల్డ్ ధర రూ. 79,050 వద్ద అమ్ముడవుతోంది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ. 1040 పెరిగింది. దీంతో తులం పసిడి ధర రూ. 86,240 వద్ద ట్రేడ్ అవుతోంది. విశాఖ పట్నం, విజయవాడలో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి. ఇక దేశ రాజధాని ఢిల్లీలో నేడు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 950 పెరిగి రూ. 79,200 వద్ద అమ్ముడవుతోంది. నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1040 పెరిగి రూ. 86390 వద్దకి చేరింది.

వెండి కూడా బంగారం బాటలోనే పయనించింది. గోల్డ్ తో పాటు సిల్వర్ కూడా పోటీపడుతోంది. నేడు వెండి ధరలు కూడా పెరిగాయి. కిలో వెండిపై రూ. 1000 పెరిగింది. హైదరాబాద్ మార్కెట్ లో కిలో వెండి ధర రూ. 1000 పెరిగింది. దీంతో రూ. 1,07,000 వద్ద ట్రేడ్ అవుతోంది. ఢిల్లీలో కిలో వెండిపై రూ. 1000 పెరగడంతో రూ. 99,500 వద్ద అమ్ముడవుతోంది. బంగారం, వెండి ధరలు పైపైకి ఎగబాకుతుండడంతో కొనుగోలుదారులు ఆందోళన చెందుతున్నారు.