NTV Telugu Site icon

Stock market: ఆల్‌ టైమ్ రికార్డ్‌లు సొంతం చేసుకున్న సూచీలు

Stockmarket

Stockmarket

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మరోసారి రికార్డ్ స్థాయిలో దూసుకెళ్లాయి. అంతర్జాతీయంగా ప్రతికూల అంశాలు ఉన్నప్పటికీ సోమవారం మన సూచీలు ఆరంభంలో లాభాలతో ప్రారంభమయ్యాయి. క్రమక్రమంగా పుంజుకుంటూ భారీ లాభాల దిశగా ట్రేడ్ అయ్యాయి. ఇక నిఫ్టీ తొలిసారి 24, 600 మార్కు దాటగా.. సెన్సెక్స్ కూడా రికార్డు గరిష్ట స్థాయి 80,893.51కి చేరువైంది. తాజాగా రెండు సూచీలు ఆల్‌టైమ్ రికార్డును సొంతం చేసుకున్నాయి. సెన్సెక్స్ 145 పాయింట్లు లాభపడి 80,664 దగ్గర ముగియగా.. నిఫ్టీ 84 పాయింట్లు లాభపడి 24, 586 దగ్గర ముగిసింది.

ఇది కూడా చదవండి: CM Chandrababu: మరో శ్వేతపత్రం విడుదల చేసిన సీఎం చంద్రబాబు

నిఫ్టీలో ఒఎన్‌జీసీ, శ్రీరామ్ ఫైనాన్స్, ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, బజాజ్ ఆటో, ఎస్‌బీఐ భారీ లాభాల్లో దూసుకెళ్లగా.. ఎల్‌టీఐఎండ్‌ట్రీ, ఏషియన్ పెయింట్స్, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, టాటా స్టీల్ మరియు యాక్సిస్ బ్యాంక్ నష్టపోయాయి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మినహా అన్ని రంగాల కొనుగోళ్ల మధ్య నిఫ్టీ తాజా ఆల్-టైల్ గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. జూలై 15న వరుసగా రెండో సెషన్‌లో దలాల్ స్ట్రీట్‌లో రికార్డు రన్ కొనసాగింది. సెక్టార్లలో ఐటీ మినహా మిగిలిన అన్ని రంగాల సూచీలు గ్రీన్‌లో ముగిశాయి, ఆటో, ఫార్మా, పీఎస్‌యూ బ్యాంక్, రియాల్టీ, ఆయిల్ అండ్ గ్యాస్ సూచీలు 1-3 శాతం పెరిగాయి.

ఇది కూడా చదవండి: Rythu Runa Mafi : రైతులకు గుడ్‌న్యూస్‌.. రుణమాఫీకి ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల