NTV Telugu Site icon

Stock market: మరోసారి ఆల్‌టైమ్‌ రికార్డులను సృష్టించిన స్టాక్ మార్కెట్

Market

Market

దేశీయ స్టాక్ మార్కెట్ మరోసారి సరికొత్త రికార్డ్‌ను సృష్టించింది. అంతర్జాతీయ మార్కెట్‌లో మిశ్రమ ఫలితాలు కారణంగా గురువారం ఫ్లాట్‌గా ప్రారంభమైన సూచీలు.. కొద్దిసేపటికే జీవితకాల గరిష్టాలను నమోదు చేశాయి. సెన్సెక్స్ 85, 372 మార్కు క్రాస్ చేయగా.. నిఫ్టీ 26, 200 మార్కు క్రాస్ చేసి ఆల్‌టైమ్‌ రికార్డులను సొంతం చేసుకున్నాయి. ఇక ముగింపులో భారీ లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 666 పాయింట్లు లాభపడి 85, 836 పాయింట్లు దగ్గర ముగియగా.. నిఫ్టీ 211 పాయింట్లు లాభపడి 26, 216 దగ్గర ముగిసింది. ఇక రూపాయి మారకం విలువ డాలర్‌తో పోలిస్తే రూ. 83.60 దగ్గర ముగిసింది.

ఇది కూడా చదవండి: India-China: సరిహద్దు వివాదం.. భారత్-చైనాల మధ్య ఉన్నత స్థాయి చర్చలు మరింత ఆలస్యం..!

నిఫ్టీలో మారుతీ సుజుకీ, టాటా మోటార్స్, శ్రీరామ్ ఫైనాన్స్, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, ఎం అండ్ ఎం లాభాలను ఆర్జించగా… ఓఎన్‌జీసీ, సిప్లా, ఎన్‌టీపీసీ, హీరో మోటోకార్ప్, ఎల్ అండ్ టీ నష్టపోయాయి. సెక్టార్లలో మెటల్, ఆటో 2 శాతం చొప్పున, ఎఫ్‌ఎంసీజీ, పీఎస్‌యూ బ్యాంక్ సూచీలు 1 శాతం చొప్పున పెరిగాయి. అయితే క్యాపిటల్ గూడ్స్ ఇండెక్స్ 0.6 శాతం క్షీణించింది. బిఎస్‌ఇ మిడ్‌క్యాప్ ఇండెక్స్ ఫ్లాట్‌గా ముగియగా, స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 0.4 శాతం క్షీణించింది.

ఇది కూడా చదవండి: Iraqi Airways: చైనా వెళ్తున్న ఇరాకీ ఎయిర్‌వేస్ విమానం కోల్‌కతాలో అత్యవసర ల్యాండింగ్..