NTV Telugu Site icon

Stock market: మైక్రోసాఫ్ట్‌ విండోస్‌ ఎఫెక్ట్‌! భారీగా పతనమైన స్టాక్ మార్కెట్

Stock

Stock

మైక్రోసాఫ్ట్‌ విండోస్‌‌లో తలెత్తిన సమస్య కారణంగా అన్ని సంస్థలను అతలాకుతలం చేసింది. ఈ ప్రభావం స్టాక్ మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపించింది. గురువారం సెన్సెక్స్, నిఫ్టీ జీవితకాల గరిష్టాలను నమోదు చేసిన సూచీలు.. శుక్రవారం మాత్రం అందుకు భిన్నంగా తిరోగమనంలో కొనసాగాయి. ఉదయం స్వల్ప నష్టాలతో ప్రారంభం కాగా.. అనంతరం క్రమక్రమంగా భారీ నష్టాల దిశగా ట్రేడ్ అయింది. అన్ని రంగాల సూచీలు నష్టాల్లోనే ట్రేడ్ అయ్యాయి. సెన్సెక్స్ 738 పాయింట్లు నష్టపోయి 80, 604 దగ్గర ముగియగా.. నిఫ్టీ 269 పాయింట్లు నష్టపోయి 24, 530 దగ్గర ముగిసింది. రూపాయి మారకం విలువ డాలర్‌పై రూ.83.65 దగ్గర ముగిసింది.

ఇది కూడా చదవండి: Parliament Session: బడ్జెట్ సమావేశాల్లో 6 కీలక బిల్లులను ప్రవేశపెట్టనున్న కేంద్రం.. వివరాలు..

నిఫ్టీలో ఇన్ఫోసిస్, ఐటీసీ, ఎల్‌టీఐఎండ్‌ట్రీ, ఏషియన్ పెయింట్స్, ఎస్‌బీఐ లాభాల్లో కొనసాగగా.. టాటా స్టీల్, జెఎస్‌డబ్ల్యు స్టీల్, హిందాల్కో, బీపీసీఎల్, టెక్ మహీంద్రా నష్టపోయాయి.

ఇది కూడా చదవండి: Home Minister Anitha: కాలినడకన తిరుమల చేరుకున్న హోంమంత్రి అనిత