NTV Telugu Site icon

Stock market: మరోసారి ఆల్‌టైమ్ రికార్డ్‌లు సృష్టించిన సూచీలు

Stock

Stock

దేశీయ స్టాక్ మార్కెట్ మరోసారి భారీ లాభాల్లో పరుగులు పెట్టింది. ఇక సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు సరికొత్త రికార్డుల్ని సృష్టించాయి. అంతర్జాతీయంగా సానుకూల పవనాలు దేశీయ మార్కెట్లకు దన్నుగా నిలిచియాయి. దీంతో ఆరంభ ట్రేడింగ్‌లోనే రెండు ప్రధాన సూచీలు రికార్డు గరిష్ఠాలను తాకాయి. తొలిసారి సెన్సెక్స్‌ 80,000 కీలక మైలురాయిని తాకి 80,074 దగ్గర సరికొత్త రికార్డును నెలకొల్పింది. అలాగే నిఫ్టీ కూడా 24,296 దగ్గర తాజా జీవనకాల గరిష్ఠాన్ని నమోదు చేసింది. ఇక ముగింపులో సెన్సెక్స్ 545 పాయింట్లు లాభపడి 79, 986 దగ్గర ముగియగా.. నిఫ్టీ 162 పాయింట్లు లాభపడి 24, 286 దగ్గర ముగిసింది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.53 దగ్గర ముగిసింది.

ఇది కూడా చదవండి: Team India: రేపు ప్రధాని మోడీని కలవనున్న భారత ఆటగాళ్లు..

సెన్సెక్స్‌లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, ఎస్‌బీఐ భారీ లాభాల్లో దూసుకెళ్లగా.. టీసీఎస్, రిలయన్స్ ఇండస్ట్రీస్, టాటా మోటార్స్, టైటాన్ కంపెనీ, ఎల్‌అండ్‌టి నష్టపోయాయి.

ఇది కూడా చదవండి: Bhole baba: హత్రాస్ భోలే బాబాపై లైంగిక వేధింపుల కేసులు.. బ్యాగ్రౌండ్ ఇదే!