Site icon NTV Telugu

Stock market: లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్

Market

Market

దేశీయ స్టాక్ మార్కెట్ లాభాలతో ముగిసింది. మంగళవారం సెన్సెక్స్, నిఫ్టీలు జీవితకాల గరిష్టాలను నమోదు చేశాయి. చివరిలో మాత్రం ఫ్లాట్‌గా ముగిశాయి. ఇక బుధవారం ప్రారంభంలో తీవ్ర ఒడిదొడుకులను ఎదుర్కోంది. అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు ఉన్నప్పటికీ నష్టాలతో సూచీలు ప్రారంభమయ్యాయి. అనంతరం క్రమక్రమంగా లాభాల్లోకి పుంజుకున్నాయి. ఇక ముగింపులో సెన్సెక్స్ 255 పాయింట్లు లాభపడి 85, 169 దగ్గర ముగియగా.. నిఫ్టీ 63 పాయింట్లు లాభపడి 26,004 దగ్గర ముగిసింది. ఇక రూపాయి మారకం విలువ డాలర్‌తో పోలిస్తే రూ.83.60 దగ్గర ముగిసింది.

ఇది కూడా చదవండి: Asia power index: జపాన్‌ని అధిగమించి ‘‘మూడో శక్తివంతమైన’’ దేశంగా భారత్..

నిఫ్టీలో పవర్ గ్రిడ్ కార్ప్, ఎన్‌టీపీసీ, యాక్సిస్ బ్యాంక్, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, బజాజ్ ఫిన్‌సర్వ్ భారీ లాభాల్లో కొనసాగగా.. ఎల్‌టీఐఎండ్‌ట్రీ, టెక్ మహీంద్రా, టాటా కన్స్యూమర్, టాటా మోటార్స్, టైటాన్ కంపెనీ నష్టపోయాయి. బీఎస్‌ఈలో మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ సూచీలు 0.5 శాతం చొప్పున క్షీణించాయి. సెక్టోరల్‌లో పవర్, మీడియా, రియల్టీ సూచీలు 0.5-1 శాతం, ఆటో, ఎఫ్‌ఎమ్‌సిజి, పిఎస్‌యు బ్యాంక్, ఐటి 0.5-1 శాతం మధ్య క్షీణించాయి.

ఇది కూడా చదవండి: Perni Nani: తిరుమల లడ్డూ ప్రసాదాన్ని రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటున్నారు..

Exit mobile version