NTV Telugu Site icon

Stock market: రుచించని సంకీర్ణ బడ్జెట్.. నష్టాల్లో ముగిసిన సూచీలు

Stockmarket

Stockmarket

పార్లమెంట్‌లో మంగళవారం సంకీర్ణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ రుచించలేదు. వరుసగా మూడో రోజు స్టాక్ మార్కెట్ నష్టాలను చవిచూసింది. శుక్రవారం భారీగా పతనమైన సూచీలు.. బడ్జెట్ ముందు పుంజుకుంటుందని భావించారు. కానీ బడ్జెట్ రోజున ఎలాంటి మెరుపులు కనిపించలేదు. సెన్సెక్స్ 73 పాయింట్లు నష్టపోయి 80, 429 దగ్గర ముగియగా.. నిఫ్టీ 30 పాయింట్లు నష్టపోయి 24, 479 దగ్గర ముగిసింది. ఇక రూపాయి మారకం విలువ డాలర్‌తో పోలిస్తే రూ.83.69 దగ్గర ముగిసింది.

ఇది కూడా చదవండి: Hyderabad: సూసైడ్ నోట్ రాసి సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య.. కారణమిదే..?

నిఫ్టీలో టైటాన్ కంపెనీ, టాటా కన్స్యూమర్, ఐటీసీ, ఎన్‌టీపీసీ, అదానీ పోర్ట్స్ టాప్ గెయినర్స్‌గా కొనసాగగా.. ఎల్‌అండ్‌టీ, ఓఎన్‌జీసీ, హిందాల్కో, శ్రీరామ్ ఫైనాన్స్, బజాజ్ ఫైనాన్స్ నష్టపోయాయి. సెక్టార్లలో ఆటో, ఎఫ్‌ఎంసీజీ, హెల్త్‌కేర్, ఐటీ సూచీలు 0.5-2 శాతం పెరగగా.. బ్యాంక్, క్యాపిటల్ గూడ్స్, మెటల్, ఆయిల్ అండ్ గ్యాస్ మరియు రియాలిటీ 0.5-2 శాతం క్షీణించాయి.

ఇది కూడా చదవండి: గత ప్రభుత్వ నిర్వాకం వల్లే అమరావతి, పోలవరం పోయింది..