NTV Telugu Site icon

Stock market: నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్

Market

Market

దేశీయ స్టాక్ మార్కెట్ బుధవారం నష్టాల్లో ముగిసింది. అంతర్జాతీయ మార్కె్ట్‌లోని మిశ్రమ సంకేతాలు మన సూచీలపై తీవ్ర ప్రభావం చూపించింది. ఉదయం నష్టాల్లో ప్రారంభమైన మార్కెట్.. చివరిదాకా నష్టాల్లోనే ట్రేడ్ అయింది. ఇక ముగింపులో సెన్సెక్స్ 318 పాయింట్లు నష్టపోయి 81, 501 దగ్గర ముగియగా.. నిఫ్టీ 86 పాయింట్లు నష్టపోయి 24, 971 దగ్గర ముగిసింది. ఇక రూపాయి మారకం విలువ డాలర్‌తో పోలిస్తే రూ.83.03 దగ్గర ముగిసింది.

ఇది కూడా చదవండి: Ongole: తెగిన చెరువు కట్ట.. రోడ్డుపై మూడు అడుగుల వరద నీరు

నిఫ్టీలో ట్రెంట్, ఎం అండ్ ఎం, హీరో మోటోకార్ప్, ఇన్ఫోసిస్, టైటాన్ కంపెనీ నష్టాలు చవిచూడగా.. హెచ్‌డిఎఫ్‌సీ లైఫ్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, భారతీ ఎయిర్‌టెల్, బజాజ్ ఆటో లాభపడ్డాయి. సెక్టార్లలో, ఆయిల్ అండ్ గ్యాస్, రియల్టీ, టెలికాం సూచీలు గ్రీన్‌లో ముగియగా.. ఆటో, ఐటీ, ఫార్మా మరియు మీడియా 0.5-1 శాతం మధ్య క్షీణించాయి. బీఎస్‌ఈ మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ సూచీలు స్వల్పంగా నష్టాల్లో ముగిశాయి.

ఇది కూడా చదవండి: Champai Soren: జార్ఖండ్‌లో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం