TCS on ChatGPT: ‘చాట్‌జీపీటీ’కి ఇటీవల మంచి ఆదరణ పొందుతుంది.. చాట్‌జీపీటీ వాడేందుకు చాలా మంది ప్రయత్నిస్తున్నారట.. కొందరు ఇది ఎలా పని చేస్తుందో తెలుసుకునేందుకే వాడితే.. మరికొందరు బాగుందని వాడేవారు కూడా ఉన్నారు.. అయితే, చాట్‌జీపీటీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్).. చాట్‌జీపీటీ వంటి ప్లాట్‌ఫామ్‌లు.. ఉద్యోగుల స్థానాలను ఆక్రమించబోవని ఐటీ దిగ్గజం టీసీఎస్ చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ మిలింద్ లక్కడ్ పేర్కొన్నారు.. అవి ’కృత్రిమ మేథ (ఏఐ) గల సహోద్యోగులు’గా మాత్రమే ఉంటాయని చెప్పుకొచ్చారు.. ఒక్కో పరిశ్రమలో, ఒక్కో కస్టమరుకు ఒక్కో రకం సేవలు అవసరమవుతాయే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.. ఆ పరిస్థితులను అర్థం చేసుకుని, సందర్భానుసారంగా వాటిని అందించడం మనుషులకు మాత్రమే సాధ్యమని, వాటిని అర్థం చేసుకోవడంలో ’ఏఐ సహోద్యోగి’కి చాలా సమయం పడుతుందన్నారు మిలింద్.
Read Also: Director Lakshmi Dheeptha: నటుడిని బలవంతం చేసిన మహిళా డైరెక్టర్.. అరెస్ట్ చేసిన పోలీసులు
రోజుకోటి అనే విధంగా మార్కెట్‌లోకి వస్తున్న అత్యాధునిక టూల్స్ ఉద్యోగులపై ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం అవుతోన్న వేళ చాట్‌జీపీటీ వంటి అర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ (ఏఐ) వంటి టూల్స్‌తో ఉద్యోగాలకు ముప్పు వస్తుందని ఇటీవల కాలంలో చాలా మంది ఆందోళన వ్యక్తం చేస్తున్న వేళ.. టీసీఎస్ కామెంట్లు ఆసక్తికరంగా మారాయి.. అయితే, పదాలు, ఇమేజ్, ఆడియో, సింథెటిక్ డేటాను ఉత్పత్తి చేసే ఒక రకమైన కృత్రిమ మేథనే జనరేటివ్ ఏఐగా పరిగణిస్తారు. ఏఐ అనేది కో-వర్కర్‌గా మాత్రమే ఉంటుందని, కస్టమర్లను అర్ధం చేసుకునేందుకు అది కొంత సమయం తీసుకుంటుందని, ఈ క్రమంలోనే ఉద్యోగుల స్థానాన్ని భర్తీ చేయలేవని, కాని ఉద్యోగ నిర్వచనాలు మాత్రం మారుతాయని టీసీఎస్ చీఫ్ హెచ్‌ఆర్‌ఓ మిలింద్ లక్కాడ్ అభిప్రాయపడ్డారు. భవిష్యత్ కోసం చాట్‌జీపీటీ మంచిదేనని, ఉద్యోగులకూ ఇది సహకారంగా ఉంటుందని భావిస్తున్నామని చెప్పారు. ఇటువంటి టూల్స్ వచ్చినప్పటికీ, బిజినెస్ మోడల్‌ను మాత్రం మార్చలేవని స్పష్టం చేశారు. ఉత్పాదకత పెంచడం, పనిలో స్థిరత్వం, పాలనా అవసరాన్ని తగ్గించడం, వేగంగా డెలివరీ చేయడం వంటి వాటికి ఇటువంటి టూల్స్ ఎంతో దోహదపడతాయనే అభిప్రాయాన్ని వ్యక్తం ఏశారు మిలింద్..
Read Also: Delhi High Court: అగ్నిపథ్ స్కీమ్‌ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లు కొట్టివేత
మరోవైపు.. టీసీఎస్ ఇప్పటికే ఇటువంటి కొన్నింటిని వినియోగిస్తోందన్నారు మిలింద్.. రానున్న రెండు సంవత్సరాల్లో వీటి పనితీరుకు సంబంధించి పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉందన్నారు. ఇక, చాట్‌జీపీటీ అనేది ఎంతో విప్లవాత్మకమైన, అత్యంత ఉత్పాదకతను కలిగించేదేనని, ఐసీఆర్‌ఐఈఆర్ ఛైర్మన్, జెన్‌పాక్ట్ వ్యవస్థాపకుడు ప్రమోద్ బాసిత్ పేర్కొన్నారు. ఇక, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల కూడా బింగ్ ఏఐ లాంచ్ సందర్భంగా ఉత్పాదకతతో సమానమైన విషయాన్ని చెప్పారు – మైక్రోసాఫ్ట్ యొక్క స్వంత ఏఐ-ఆధారిత చాట్‌బాట్ ChatGPT వలె ఉంటుంది. అని ఓ ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు..
