Site icon NTV Telugu

ఉద్యోగుల‌కు గుడ్‌న్యూస్‌.. ట్యాక్స్ ఫ్రీ ప‌రిమితి రెట్టింపు..!

ఉద్యోగుల‌కు గుడ్‌న్యూస్ చెప్పేందుకు సిద్ధం అవుతుంది కేంద్ర ప్ర‌భుత్వం.. ఈ నెల పార్ల‌మెంబ్ బ‌డ్జెట్ స‌మావేశాలు ప్రారంభం కానుండ‌గా… ఫిబ్ర‌వ‌రి 1వ తేదీన పార్ల‌మెంట్‌లో 2022-23 వార్షిక బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ‌పెట్ట‌నున్నారు ఆర్థిక‌మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్‌.. రెండు విడ‌త‌ల‌గా బ‌డ్జెట్ సెష‌న్ జ‌ర‌గ‌బోతోంది.. అయితే, ప‌న్ను రహిత ప్రావిడెంట్‌ ఫండ్‌ పరిమితిని పెంచే సూచనలు క‌నిపిస్తున్నాయి.. దీనిపై బడ్జెట్‌ 2022-2023లో క్లారిటీ రాబోతోంది.. పీఎఫ్‌ ఖాతాల్లో ఒక ఆర్థిక సంవత్సరంలో ఇకపై రూ. 5 లక్షల వరకు జమ చేసుకునే ఉద్యోగులందరికీ వడ్డీపై పన్ను ఉండబోదని కేంద్రం ప్ర‌క‌టించే అవ‌కాశం ఉంద‌ని అంచ‌నా వేస్తున్నారు ఆర్థిక నిపుణులు. ప్రస్తుతం 2.5 లక్షల రూపాయలుగా పీఎఫ్‌ ట్యాక్స్‌ ఫ్రీ ప‌రిమితి ఉండ‌గా.. 2022-23 బడ్జెట్‌లో కేంద్రం దానిని రెట్టింపు చేసే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి.. కేవ‌లం ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కే మాత్ర‌మే కాదు.. ప్రైవేట్‌ ఉద్యోగుల‌కు కూడా ఇది వ‌ర్తింప‌జేయ‌నున్నారు..

గ‌త బ‌డ్జెట్‌లో ఉద్యోగుల ప్రావిడెంట్‌ ఫండ్‌పై పన్ను భారాన్ని తగ్గిస్తూ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటన చేశారు. ఉద్యోగి తరఫున భవిష్యనిధి ఖాతాకు కంపెనీ తన వాటా జమ చేయనట్టయితే.. అటువంటి కేసులకు రూ.5లక్షల పరిమితి వర్తిస్తుందని మంత్రి వెసులుబాటు కల్పించారు. కానీ, పరిమితిని రూ. 2.5 లక్షల నుంచి రూ. 5 లక్షలకు పెంచే సవరణ ఇప్ప‌టి వ‌ర‌కు ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే ప్రయోజనం చేకూర్చింద‌ని చెప్పాలి.. దీనిపై విమ‌ర్శ‌లు కూడా వ‌చ్చాయి.. ఇది వివక్షతో కూడుకున్న నిర్ణ‌య‌మంటూ ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి.. దీంతో.. జీతం ఎత్తే ఉద్యోగులందరికీ ఆ ప‌రిమితిని 5 లక్షల దాకా పెంచేందుకు కేంద్రం సిద్ధ‌మైన‌ట్టు స‌మాచారం.

Exit mobile version