Tata: ప్రపంచం ఎలక్ట్రానిక్ వాహనాల వైపు ప్రయాణిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాలకు(ఈవీ)లకు డిమాండ్ పెరిగింది. కర్భణ ఉద్గారాలను తగ్గించే లక్ష్యంతో పనిచేస్తున్న భారత ప్రభుత్వం, ఈవీ వాహనాలను ప్రోత్సహిస్తోంది. మరోవైపు ఈవీ పరిశ్రమకు అత్యంత కీలమైన లిథియం అయాన్ బ్యాటరీల తయారీలో భారత్ ఇప్పటికీ చైనా, అమెరికాల కన్నా వెనకబడే ఉంది. అయితే ఇటీవల జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున లిథియం నిల్వలు బయటపడటంతో రానున్న కాలంలో భారత్ లిథియం ఉత్పత్తితో పాటు లిథియం అయాన్ బ్యాటరీలో తయారీలో ఆత్మనిర్భర్ గా మారే అవకాశం ఏర్పడింది.
Read Also: Maharashtra : ఘోర రోడ్డు ప్రమాదం..బస్సును ఢీ కొట్టిన కారు.. ఐదుగురు మృతి..
ఇదిలా ఉంటే దేశీయ పారిశ్రామిక దిగ్గజం టాటా లిథియం బ్యాటరీ తయారీ రంగంలోకి అడుగుపెట్టబోతోంది. ఈవీ బ్యాటరీల తయారీ కోసం గుజరాత్ ప్రభుత్వంతో లిథియం అయాన్ బ్యాటరీలను తయారు చేయడానికి గిగా ప్యాక్టరీని ఏర్పాటు చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నాయి. దాదాపుగా రూ. 13,000 కోట్లతో టాటా గ్రూప్ కు అనుబంధంగా ఉన్న టాటా అగరాటాస్ ఎనర్జీ స్టోరేజ్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ పెట్టుబడి పెట్టనుంది. దీని వల్ల 13,000 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పించనుంది. 20 గిగావాట్ అవర్స్ ఉత్పత్తి కలిగి ఉండే ఎలక్ట్రిక్ వాహన బ్యాటరీ ప్లాంట్ ను స్థాపించడానికి శుక్రవారం ఎంఓయూపై సంతకం చేసింది.
2070 నాటికి ప్రపంచంలో అత్యథిక జనాభా కలిగిన భారత దేశాన్ని కార్బన్ నెట్ జోరోగా మార్చేందుకు ప్రధాని మోడీ కృషి చేస్తున్నారు. టాటా ప్లాంట్ గుజరాత్‌ను లిథియం-బ్యాటరీ తయారీలో అగ్రగామిగా మారుస్తుందని రాష్ట్రప్రభుత్వం వెల్లడించింది. అయితే దీనిపై టాటా గ్రూప్ ప్రతినిధి వ్యాఖ్యానించడానికి నిరాకరించారు. టాటా గ్రూప్ తన యూనిట్ జాగ్వార్ ల్యాండ్ రోవర్ బ్రిటన్‌లో ప్రధాన EV బ్యాటరీ ప్లాంట్‌ను ఏర్పాటు చేయడాన్ని పరిశీలిస్తున్న తరుణంలో ఈ నిర్ణయం తీసుకుంది.