NTV Telugu Site icon

Voltas: “వోల్టాస్‌”కి టాటా గుడ్ బై..?

Voltas

Voltas

Voltas: ప్రముఖ వ్యాపార సంస్థ, ఉప్పు నుంచి విమానాల దాకా వ్యాపారం చేస్తున్న టాటా గ్రూప్ తన గృహోపకరణాల వ్యాపారాన్ని విక్రయిస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి. టాటా గ్రూప్ వోల్టాస్ హోమ్ అప్లియెన్సెస్ వ్యాపారాన్ని విక్రయించాలనుకుంటున్నట్లుగా బ్లూమ్‌బర్గ్ నివేదించింది. టాటా గ్రూపుకు వోల్టాస్‌లో 30 శాతం వాటా ఉంది. వోల్టాస్ మొత్తం మార్కెట్ విలువ రూ.26,936 కోట్లుగా ఉంది. వోల్టాస్ పేరిట ఏసీలు, ఫ్రిడ్జ్‌ల వంటి హోం అప్లియెన్సెస్‌ని టాటా తయారు చేస్తోంది. మార్కెట్ లో నెలకొన్న పోటీని తట్టుకుని వ్యాపారాన్ని విస్తరించడం సవాలుతో కూడుకున్న వ్యవహారం కావడంతో వోల్టాస్ విక్రయించాలని అనుకుంటున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.

Read Also: Viral Video: ఈ వీడియో చూస్తే బార్బర్ షాపుకు వెళ్లడానికే భయపడుతారు.. బూట్లు, చెప్పులతో కొట్టుకుంటూ..!

అయితే వోల్టాస్ విక్రయం గురించి ఇప్పటి వరకు టాటా బహిరంగ ప్రకటన ఏం చేయలేదు. దీనిపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే తన జాయింట్ వెంచర్ పార్ట్‌నర్ అయిన అర్సెలిక్ ఏఎస్‌కు విక్రయించాలా..? లేకపోతే మరెవరికైనా విక్రయించాలా అనే దానిపై ఇంకా చర్చలు కొలిక్కి రాలేదని తెలుస్తోంది. కన్స్యూమర్ డ్యూరబుల్స్ లోకల్ జాయింట్ వెంచర్, వోల్ట్‌బెక్ హోమ్ అప్లియెన్సెస్‌ని ఈ విక్రయంలో చేర్చాలా..? వద్దా.? విషయాన్ని టాటా నిర్ణయించుకోలేదని విషయం తెలిసిన కొందరు వ్యక్తులు చెప్పారు.

వోల్టాస్ ముఖ్యంగా ఏసీలు, వాటర్ కూలర్లు, రిఫ్రిజిరేటర్లను తయారు చేస్తోంది. 1957లో ఈ సంస్థ ఏర్పాటైంది. దేశీయ రిఫ్రిజిరేట్ల మార్కెట్ లో ఈ కంపెనీకి 3.4 శాతం, వాషింగ్ మిషిన్ల మార్కెట్ లో 5.4 శాతం వాటా ఉంది. భారత్ తో పాటు పశ్చిమాసియా, ఆఫ్రికా దేశాలకు తన ఉత్పత్తులను విక్రయిస్తోంది. ఈ నివేదిక బయటకు రావడంతో వోల్టాస్ షేర్లు మంగళశారం 2 శాతానికి పడిపోయి 813.80కి చేరింది. గత నెలలో ముడిసరుకుల ధరల కారణంగా వోల్టాస్ రెండో త్రైమాసిక లాభం మార్కెట్ అంచనాల కంటే తక్కువగా నమోదైంది.